కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, బీజేపీలో చేరిన సోనియా గాంధీ ప్రధాన అనుచరుడు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి ప్రధాన అనుచరుడిగా ఇరవై ఏళ్ల ఏళ్ల పాటు పని చేసిన టామ్ వడక్కన్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీమానా చేశారు. అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో బీజేపీలో చేరారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. జవాన్ల ధైర్య సాహసాలను కాంగ్రెస్ పార్టీ కించపరుస్తోందని టామ్ వడక్కన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధానాలతో తాను మనస్తాపానికి గురయ్యానని చెప్పారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులు మన నేలపై దాడి చేశారని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిన ధోరణి తనకు నచ్చలేదని చెప్పారు.

https://telugu.oneindia.com/news/india/rahul-gandhi-says-pm-modi-is-scared-xi-jinping-after-china-shields-masood-azhar-again-bjp-hits-240816.html

ఏ పార్టీ అయినా దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి విధానాలు అనుసరిస్తే దానిని మనం ప్రోత్సహించకూడదన్నారు. తనకు వేరే దారి లేకపోవడంతో పార్టీని వీడుతున్నానని ఆయన చెప్పారు. కాగా, వడక్కన్ కాంగ్రెస్ పార్టీలో వేర్వేరు హోదాల్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+