వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొటెం స్పీకర్-సుప్రీం ఆదేశాలు: మాదే విజయమని కాంగ్రెస్ లాయర్, భయమని బీజేపీ లాయర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య నియామకాన్ని తప్పుబడుతూ జేడీఎస్ - కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే వారు కోరిన లైవ్ తదితరాలకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అనంతరం కాంగ్రెస్ తరఫు న్యాయవాది సింఘ్వీ మీడియాతో మాట్లాడారు.

సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో బలపరీక్ష పారదర్శకంగా సాగుతుందని భావిస్తున్నామని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ - జేడీఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లైవ్ వల్ల పారదర్శతగా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

KG Bopaiah To Stay Temporary Speaker, Floor Test To Be Broadcast Live

కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిందని, వారికి భయం ఉన్నట్లుగా ఉందని బీజేపీ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ అన్నారు. వారికి ఫ్లోర్ టెస్ట్ తొలి ప్రాధాన్యత కాదేమోనని, భయపడుతున్నారన్నారు.

అంతకుముందు, త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ పిటిషన్లను తోసిపుచ్చి ప్రొటెం స్పీకర్‌గా బొపయ్యనే కొనసాగించాలని స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌-జేడీఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తన వాదనలు వినిపించారు. ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను నియమించడం సంప్రదాయాలకు విరుద్ధమని, ఎక్కువ సార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేనే ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవాలని, కానీ గవర్నర్‌ బోపయ్యను నియమించారని, శాసనసభ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడానికైతే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ.. ఆయనే విశ్వాసపరీక్షను చేపట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

బోపయ్య బలపరీక్ష నిర్వహించడానికి అనుమతి ఇవ్వకూడదని సిబల్‌ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇందుకు సుప్రీం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఈయన్నే నియమించాలని చట్టం ఎలా ఆదేశిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది.

యడ్యూరప్ప ప్రమాణస్వీకారం విషయంలో మేం అర్ధరాత్రి విచారణ చేపట్టామని, కానీ ఇప్పుడు మీరు ప్రొటెం స్పీకర్‌ విషయంలోనూ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారని, కానీ ప్రొటెం స్పీకర్‌ను మేం ఎలా నియమించగలమని, ఈ విషయంలో గవర్నర్‌ను ఆదేశించడం చట్టంలో లేదని, సీనియర్‌ సభ్యులే ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికవడం అనేది సంప్రదాయమని, అయితే దానికి చట్టబద్ధత లేదని, అంతేగాక గతంలోనూ సీనియర్‌ సభ్యులు కాని వారు ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన సందర్భాలున్నాయని, ఒకవేళ మీరు అంతగా అడిగితే స్పీకర్‌కు నోటీసులు పంపి, విశ్వాసపరీక్షను వాయిదా వేస్తామన్నారు.

English summary
Congress' Abhishek Manu Singhvi says the Supreme Court has addressed all their concerns by directing that the trust vote be telecasted live.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X