బెంగళూరు ఘటనలో ట్విస్ట్: మరదలిని పెళ్ళిచేసుకొనేందుకు లైంగికదాడి నాటకం

మరదలిని పెళ్ళిచేసుకొనేందుకుగాను లైంగికదాడి జరిగినట్టుగా డ్రామా ఆడారు. ఈ డ్రామాను కర్ణాటక పోలీసులు చేధించారు. సిసి కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడు భావే అని తేల్చారు పోలీసులు.

బెంగుళూరు :ప్రేమించిన మరదలిని వివాహం చేసుకోవాలని లైంగిక దాడి జరిగిందనే నాటకం ఆడారు. లైంగిక దాడి జరిగిందంటే ఈ పెళ్ళికి ఎవరూ కూడ అడ్డుపడరనే ఉద్దేశ్యంతో బావ మరదళ్ళు ఆడిన నాటకానికి పోలీసులు తెరదించారు.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని కెజిహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై లైంగిక దాడి ఘటనను పోలీసులు చేధించారు.

కర్ణాటక రాష్ట్రంలోని గోవింపురానికి చెందిన ఇర్షాద్ ఖాన్ , అతని మరదలు ను ప్రేమించాడు.. బాదితురాలు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె ఇర్షాద్ ఖాన్ ఇంట్లోనే ఉంటోంది.మూడేళ్ళుగా ఆమె బావతో ప్రేమలో పడింది. వారి పెళ్ళికి తన అక్క అంగీకరించదనే కారణంతో ఓ ప్లాన్ వేశారు ఇద్దరూ.ఈ ప్లాన్ ను అమలు చేశారు.మరదలిపై లైంగిక దాడి జరిగిందనే ప్రచారం జరిగితే ఆమెను వివాహం చేసుకొనేందుకు ఎవరూ కూడ ముందుకు రారు. ఆ సమయంలో తాను ఆమెను వివాహం చేసుకొనేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారిద్దరూ భావించారు.

ఈ మేరకు ఈ ప్లాన్ ను అమలు చేయాలని అనుకొన్నారు.ఈ నెల ఐదవ తేదిన ఉదయం ఆరుగంటలకు ఈ పథకాన్ని అమలుచేశారు. ముసుగు ధరించిన ఓ యువకుడు ఆ యువతి వెంట పడ్డాడు. ఈ దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యేలా జాగ్రత్త తీసుకొన్నాడు. ఆ తర్వాత ఆ యువతి తన చేయి, నాలిక కరుచుకొని గాయం చేసుకొంది. తనపై లైంగిక దాడి జరిగిందని ఆమె కెజిహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

kg halli molestation ends up as stage managed drama

అయితే ఈ కేసు చేదించేందుకు పోలీసులు జాప్యం చేస్తున్నారని ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. నిందితుడిని అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకొన్నారు.

నడకే ఇర్షాద్ ను పట్టించింది

సిసి కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు మినహ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే సిసి కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల్లో ఇంతవరకు నిందితుడి ఆచూకీ లభ్యం కాలేదు.అయితే ఇర్షాద్ ఖాన్ కొంచెం కుంటుతూ నడుస్తాడు. సిసి కెమెరాల్లో రికార్డైన అయిన వ్యక్తి కొంచెం కుంటుతూ పరుగెత్తినట్టుగా రికార్డు అయింది. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు చేధించారు.పోలీసులు ఇర్షాద్ ఖాన్ అరెస్టు చేసి విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. పెళ్ళికోసమే థాము ఈ నాటకం ఆడామని వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+