ఓటు వేపిన స్టార్ హీరో, నిర్లక్షం చేస్తే ఐదు ఏళ్లు అంతే గతి, పోలింగ్ కేంద్రంలో మహిళకు గుండెపోటు !

కర్ణాటక రాష్ట్రంలోని 14 లోక్‌సభ నియోజక వర్గాల్లో హోరాహోరీగా పోలింగ్ కొనసాగుతుంది. కర్ణాటకలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరుతున్నారు. పోలింగ్ బూత్‌ల వద్దకు వెలుతున్న ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

బెంగళూరులో ఎండలు భారీగా పెరిగినా పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలైన్లో ప్రజలు సంఖ్య ఏమాత్రం ఆగడం లేదు. బెంగళూరు నగరంలోని హోసకెరహళ్లిలో కేజీఎఫ్ హీరో యశ్ ఓటు వేశారు. ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడిన హీరో యశ్ ప్రతి ఒక్కరూ ఓటు వేసి వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు మనవి చేశారు. ప్రజలు వారి ఓటు హక్కు గురించి తెలుసుకోవాలని హీరో యశ్ అన్నారు.

KGF star hero Yash voted in Bengaluru city A woman voter collapsed due to a heart attack
ప్రజాసేవ చెయ్యడనికి నాయకులకు ప్రజలే అవకాశం ఇస్తారని, ఓటు వేసిన వాళ్లు వారి నాయకుడిని ఎన్నుకుంటారని, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు ఏం చెయ్యాలో అది చెయ్యాలని హీరో యశ్ అన్నారు. ప్రతిఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని స్టార్ హీరో యష్ ప్రజలకు మనవి చేశారు. ఒక్కసారి ఓటు వెయ్యకపోతే ఐదు సంవత్సరాలు మనం చాలా నష్టపోతామని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని హీరో యశ్ అన్నారు.

బెంగుళూరులోని జేపీ నగర్ 8వ స్టేజ్ లోని జంబూ సవారి దిన్నెలో ఓ మహిళ ఓటు వెయ్యడానికి వెళ్లి ఎండవేడిమితో, అలసటతో గుండెపోటు రావడంతో పోలింగ్ కేంద్రం దగ్గర కుప్పకూలిపోయారు. పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఆ మహిళ దాహం వేసి నీళ్లు తాగేందుకు వెళ్లింది. అదే సమయంలో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. గుండెపోటుతో మహిళ కుప్పకూలిపోవడంతో ఓటు వెయ్యడానికి వచ్చిన ప్రజలు హడలిపోయారు.

KGF star hero Yash voted in Bengaluru city A woman voter collapsed due to a heart attack

బొమ్మసంద్రలోని నారాయణ ఆరోగ్య కేంద్రంలో ఉన్న కిడ్నీ నిపుణుడు డాక్టర్ గణేష్ శ్రీనివాస ప్రసాద్ వెంటనే స్పందించి ఆ మహిళను పరీక్షించి సరైన సమయంలో ఆమెకు ప్రథమ చికిత్స అందించి ఆమె ప్రాణాలు కాపాడారు. మహిళను పరీక్షించిన వైద్యుడు గణేశ్ శ్రీనివాస్ కు ఆ మహిళకు పల్స్ తక్కువగా ఉందని, శరీరం కూడా స్పందించలేదని ఆయన గుర్తించారు. అక్కడికక్కడే డాక్టర్ గణేశ్ శ్రీనివాస్ సీపీఆర్ నిర్వహించగా ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.

ఎలక్షన్ డ్యూటీలో ఉన్న డాక్టర్ గణేష్ శ్రీనివాస ప్రసాద్ వెంటనే స్పందించి ఆ మహిళకు సహాయం చేసి ఆసుపత్రికి తరలించారు. ఐదు నిమిషాల్లోనే అంబులెన్స్‌ అక్కడికి చేరుకుని ఆ మహిళను తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. అదృష్టవశాత్తూ మహిళ క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. శుక్రవారం బెంగళూరులో విపరీతమైన ఎండ ఉండటంతో పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు వెంట మంచినీళ్లు తీసుకెళ్లి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+