Ujjain Khade Hanuman: జేసీబీలు, క్రేన్లతో లాగినా అంగుళం కూడా కదలని హనుమాన్ విగ్రహం..!!

మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయిని నగరంలో ప్రాచీన కాలం నాటి హనుమాన్ ఆలయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. జేసీబీలు, క్రేన్లతో లాగినా 170 ఏళ్ల నాటి హనుమాన్ విగ్రహం మాత్రం అంగుళం కూడా అక్కడినుంచి కదల్లేదని సమాచారం అందుతోంది. ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ప్రాచీన హనుమాన్ ఆలయాన్ని అధికారులు తొలగించారు. అయితే అందులోని హనుమాన్ విగ్రహం మాత్రం అక్కడి నుంచి తరలించడం సాధ్యం కాలేదని తెలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు రోజుల పాటు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించినా.. భారీ యంత్రాలతో ప్రయత్నించినా విగ్రహం ఒక్క అంగుళం కూడా కదల్లేదని సమాచారం. కంఠాల్ చౌరాహా- ఛత్రీ చౌక్ రహదారిపై ఉన్న ఖడే హనుమాన్ ఆలయానికి దాదాపు 170 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఏం జరిగిందంటే..?

ఉజ్జయినిలోని సింహస్థ 2028 కుంభమేళా ఏర్పాట్లలో భాగంగా రోడ్డు విస్తరణ పనులను స్థానిక అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఖడే హనుమాన్ విగ్రహాన్ని కూడా మరో ప్రాంతానికి తరలించనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. అయితే హనుమాన్ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు, స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం. ఇందోర్ నుంచి ప్రత్యేకంగా నిపుణులను రప్పించి.. అత్యాధునిక సాంకేతికతను వినియోగించినా గడచిన రెండు రోజులుగా హనుమాన్ విగ్రహం అంగుళం కూడా పక్కకు జరగలేదు. దాంతో ఇది దైవశక్తి మహిమ అంటూ స్థానిక ప్రజలు, భక్తులు గట్టిగా నమ్ముతున్నారు.

KhadeHanuman 170 year idol Ujjain did not budge even an inch despite being pulled by JCBs cranes

ఇక ఈ విషయంపై ఉజ్జయిని SDM L.N. గార్గ్ వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు ఖడే హనుమాన్ విగ్రహాన్ని తరలించేందుకు యంత్రాలతో కానీ, మానవ ప్రయత్నాలతో కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆయన తెలిపారు. విగ్రహాన్ని తరలించేందుకు పలుమార్లు ప్రయత్నించారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవ పట్టించేదని తెలిపారు. నిపుణుల పరిశీలన తర్వాత మాత్రమే ఈ విగ్రహం విషయంలో నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అలాగే విగ్రహం తరలింపు విషయంలో భక్తుల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+