Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఖామోష్: శత్రఘ్ను సిన్హాకు బిజెపి యువమోర్చా షాక్

పాట్నా: తన మాటల ద్వారా భారతీయ జనతా పార్టీని చిక్కుల్లో పెట్టే ఆ పార్టీ ఎంపీ, నటుడు శతృఘ్ను సిన్హాకు బిజెపి యూత్ వింగ్ హెచ్చరికలు జారీ చేస్తూ ఓ బ్యానర్‌ను ప్రదర్శించింది. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. ఖామోష్.. శత్రఘ్ను సిన్హా అంటూ ఆ బ్యానర్లో పేర్కొంది.

బిజెపి యువమోర్చా ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. ఖామోష్ పేరిట ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిన్నటి బాలీవుడ్ స్టార్ హీరో అయిన శతృఘ్ను సిన్హా తన సినిమాలోని ఖామోష్ అనే ఊతపదాన్ని తరుచూ ఉపయోగించేవారు.

Khamosh, Says Banner Against Shatrughan Sinha, Courtesy BJP Youth Wing

ఆయన తాజాగా తీసుకు వచ్చిన తన జీవిత కథకు కూడా 'ఎనీథింగ్ బట్ ఖామోష్' అని పేరు పెట్టారు. అయితే కొంతకాలంగా బిజెపి అధినాయకత్వం విషయంలో అతను విమర్శలు చేస్తున్నారు. బాహాటంగానే పార్టీ పెద్దలను విమర్శిస్తున్నారు.

తద్వారా బిజెపిని చిక్కుల్లో పెడుతున్నారు. బిజెపిని ఇబ్బంది పెట్టే దాదాపు ప్రతి అంశంలో దానిని సమర్థిస్తూ.. పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారు. గత నెలలో అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో.. శత్రఘ్నును నోరు మూయాలంటూ బిజెపి యువమోర్చా పోస్టర్ ఏర్పాటు చేసింది. పార్టీ అధినాయకత్వం ఆయన పైన చర్యలు తీసుకోవాలని అందులో విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+