15 వేల మంది రాఖీ కట్టారు.. మోస్ట్ లక్కీ పర్సన్..
తోబుట్టుల బంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి పండగను చూస్తారు. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు అనుబంధాలను రాఖీ పండుగ బలోపేతం చేస్తుంటుంది. ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా అన్న కోసం చెల్లెలు, తమ్ముడి కోసం అక్క వెళ్లి వారికి రాఖీలు కడుతుంటారు. అయితే ఓ టీచర్ కు రాఖీలు కట్టారు విద్యార్థినులు. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 వేల మంది స్టూడెంట్స్ ఆ టీచర్ కు రాఖీ కట్టి తమ ప్రేమ, అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఘటన బిహార్ లో జరిగింది.

బిహార్ కు చెందిన ప్రముఖ ఎడ్యుకేటర్, టీచర్ ఫైజల్ ఖాన్ గురించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సుపరిచితమే. ఖాన్ సర్ గా ఆయన సామాజిక మాధ్యమాల్లో వెరీ ఫేమస్. ఆయన వీడియో క్లాసులకు లక్షల్లో వ్యూస్ ఉంటాయి. అయితే రక్షా బంధన్ సందర్భంగా ఫైజల్ ఖాన్ కు స్టూడెంట్స్ ప్రేమతో రాఖీ కట్టారు. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 వేల మంది స్టూడెంట్స్ రాఖీ కట్టారు. దీంతో ఆయన చేయి పూర్తిగా రాఖీలతో నిండిపోయింది. తనకు బ్లడ్ సర్క్యులేషన్ కావడం లేదని వాపోతూనే.. ఇది తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
🔥 There’s something special about this man…
— The Nexus News (@The_NexusNews) August 9, 2025
You don’t get 15,000 rakhis tied on you for no reason!
On this Raksha Bandhan, Patna’s famous teacher Khan Sir was tied over 15,000 rakhis by sisters from all walks of life.
And that’s not all — he arranged 156 different dishes for… pic.twitter.com/08MRCkjiz6
ఖాన్ సర్ కు రాఖీలు కట్టేందుకు గంటలపాటు గర్ల్స్ క్యూలైన్ లో వేచి ఉన్నారు. బిహార్ పట్నాలోని శ్రీ కృష్ణా మెమోరియల్ హాల్ లో ఈ ఘటన జరిగింది. ఖాన్ సర్ ఆన్ లైన్ క్లాసుల ద్వారా బిహార్ లోని అనేక జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల విద్యార్థులకు ఫేవరెట్ గా మారారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంతోమంది ఉన్నత ఉద్యోగాలు సాధించారు. దీంతో వేల మంది కృతజ్ఞతగా ఖాన్ సర్ కు రాఖీలు కట్టేందుకు పోటీ పడ్డారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications