ప్రధాని మోదీ తండ్రిపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు..!
భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆదివారం బీహార్ లోని పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఖర్గే ప్రసంగిస్తుండగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లరని ప్రేక్షకుల నుంచి ఒక వ్యక్తి వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆ వ్యాఖ్యకు స్పందించిన ఖర్గే.. 'మోదీ కా బాప్ భీ జాయేగా' (మోదీ తండ్రి కూడా దిగిపోవాల్సిందే) అని రెండుసార్లు వ్యాఖ్యానించారు. దాంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోదీతో పాటు ఆయన తండ్రిని అలాగే దేశ ప్రతిష్టను కూడా ఖర్గే అవమానించారని బీజేపీ మండిపడుతోంది. బిహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ 139 వ జయంతి వేడుకలు తాజాగా పట్నాలో జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. ఈ కార్యక్రమంలోనే మోదీ దివంగత తండ్రిని కూడా ఖర్గే వివాదంలోకి లాగడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
🚨🔥 “MODI KA BAAP BHI JAYEGA!” 😳पटना में कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे का PM मोदी पर विवादित बयान!A man said, “Modi ji kahin nahi jayenge.” Kharge reportedly fired back: “Modi ka baap bhi jayega!”🎯 Is this political discourse?#Kharge #Modi #BiharPolitics https://t.co/wyscQMz5H1
— चंद्रशेखर पाठक 🔥 (@Chandra23050689) October 25, 2026
ఈ మేరకు బిహార్ లోని కొట్వాలీ పోలీస్ స్టేషన్ లో ఖార్గేపై కేసు కూడా నమోదైంది. ప్రధాని నరేంద్ర మోదీ తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ బిహార్ లోని బీజేపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కృష్ణ సింగ్ కల్లు ఈ మేరకు పాట్నాలోని కొట్వాలీ పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఖర్గేపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'ఎక్స్' వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ దివంగత తండ్రిని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు అత్యంత నీచమైన, హుందాతనం తప్పిన వ్యాఖ్యలు చేసి అన్ని హద్దులను మీరారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత 12 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో ఓటమి కారణంగా తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఎలాంటి విధానాలు, ప్రజా సమస్యలు లేకపోవడంతో కేవలం 'బూతుల రాజకీయాలకే' పరిమితమైందని అమిత్ షా ఘాటుగా విమర్శించారు. అలాగే ప్రధాని తల్లిని దూషించడం, 'మర్చంట్ ఆఫ్ డెత్' అని చెప్పడం.. 'చాయ్ వాలా' అంటూ హేళన చేసి మాట్లాడటం వంటి చర్యలు కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications
