Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Khiladi: కేటుగాడు, 100 మంది లేడీస్ కు సేమ్ డైలాగ్, లక్షలు స్వాహా, అందరితో ఎంజాయ్, లేడీ డాక్టర్ తో!

న్యూఢిల్లీ/ ముంబాయి: మ్యాట్రీమోనీ వెబ్ సైట్ లో పెళ్లి కొడుకు కోసం ఓ లేడీ డాక్టర్ వెతికింది. ఇదే సమయంలో ఎంబీఏ పూర్తి చేశానని, తనకు వెనుకా ముందు ఎవ్వరూ లేరని, సొంత వ్యాపారం చేస్తూ నెలనెల లక్షల రూపాయల డబ్బులు సంపాధిస్తున్నానని చెప్పిన యువకుడు ఆ లేడీ డాక్టర్ కు పరిచయం అయ్యాడు. విలాసవంతమైన ఖరీదైన కారులో ఆ యువకుడు లేడీ డాక్టర్ ను చూడటానికి వెళ్లాడు. అదే కారులో కొంతకాలం లేడీ డాక్టర్ తో అతను తిరిగాడు.

ఖర్చులు కూడా విపరీతంగా పెడుతున్న వ్యక్తి నిజంగానే కోటీశ్వరుడు అని నమ్మిన లేడీ డాక్టర్ అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యింది. వ్యాపార అవసరాలు, చేతి ఖర్చుల కోసం లేడీ డాక్టర్ దగ్గర రూ. 15 లక్షలు తీసుకున్న అతను కొంతకాలం తరువాత మాయం అయ్యాడు. ఇంతకాలం తనతో తిరిగిన వ్యక్తి తనను మోసం చేశాడని గుర్తించిన లేడీ డాక్టర్ అతని మీద పోలీసు కేసు పెట్టింది. పోలీసులు కేసు విచారణ చేసి కేటుగాడిని అరెస్టు చేశాడు. ఇతను లేడీ డాక్టర్ ను మాత్రమే కాకుండా ఏకంగా 9 రాష్ట్రాల్లో సుమారు 100 మందికి పైగా యువతులు, మహిళలను మోసం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు.

పెళ్లి చేసుకోవాలని అనుకున్న లేడీ డాక్టర్

పెళ్లి చేసుకోవాలని అనుకున్న లేడీ డాక్టర్

ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల లేడీ డాక్టర్ ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నారు. మ్యాట్రీమోనీ వెబ్ సైట్ లో మంచి పెళ్లి కొడుకును చూసి పెళ్లి చేసుకోవలని లేడీ డాక్టర్ వెతికింది. ఇదే సమయంలో ఎంబీఏ పూర్తి చేశానని, తనకు వెనుకా ముందు ఎవ్వరూ లేరని, సొంత వ్యాపారం చేస్తూ నెలనెల లక్షల రూపాయల డబ్బులు సంపాధిస్తున్నానని చెప్పిన బర్హాన్ తసీర్ ఖాన్ (35) అనే యువకుడు ఆ లేడీ డాక్టర్ కు పరిచయం అయ్యాడు.

 ఖరీదైన విలాసవంతమైన కారు, రూ. లక్షల్లో ఖర్చులు

ఖరీదైన విలాసవంతమైన కారు, రూ. లక్షల్లో ఖర్చులు

విలాసవంతమైన ఖరీదైన కారులో బర్హాన్ తసీర్ ఖాన్ ఆ లేడీ డాక్టర్ ను చూడటానికి వెళ్లాడు. అదే కారులో కొంతకాలం లేడీ డాక్టర్ తో బర్హాన్ తసీర్ ఖాన్ తిరిగాడు. ఖర్చులు కూడా విపరీతంగా పెడుతున్న బర్హాన్ తసీర్ ఖాన్ నిజంగానే కోటీశ్వరుడు అని నమ్మిన లేడీ డాక్టర్ అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యింది.

రూ. 15 లక్షలు తీసుకుని ఎస్కేప్

రూ. 15 లక్షలు తీసుకుని ఎస్కేప్

కొన్ని నెలల పాటు ఢిల్లీకి చెందిన లేడీ డాక్టర్ తో బర్హాన్ తసీర్ ఖాన్ చాలా క్లోజ్ గా, నమ్మకంగా, ఆమెకు ఎలాంటి డౌట్ రాకుండా ఆమెను విలాసవంతమైన కారులో తిప్పాడు. వ్యాపార అవసరాలు, చేతి ఖర్చుల కోసం లేడీ డాక్టర్ దగ్గర రూ. 15 లక్షలు తీసుకున్న బర్హాన్ తసీర్ ఖాన్ కొంతకాలం తరువాత మాయం అయ్యాడు. ఇంతకాలం తనతో తిగిని బర్హాన్ తసీర్ ఖాన్ తనను మోసం చేసి నిలువునా ముంచేశాడని గుర్తించిన లేడీ డాక్టర్ అతని మీద పోలీసు కేసు పెట్టింది.

9 రాష్ట్రాల్లో 100 మంది మహిళలకు పంగనామాలు

9 రాష్ట్రాల్లో 100 మంది మహిళలకు పంగనామాలు

పోలీసులు కేసు విచారణ చేసి కేటుగాడు బర్హాత్ తసీర్ ఖాన్ ను అరెస్టు చేశాడు. బర్హాత్ తసీర్ ఖాన్ ఢిల్లీకి చెందిన లేడీ డాక్టర్ ను మాత్రమే కాకుండా ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, ముంబై, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశాతో పాటు ఏకంగా 9 రాష్ట్రాల్లో సుమారు 100 మందికి పైగా యువతులు, మహిళలను మోసం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు.

ఖరీదైన కారు, నాలుగు ఫోన్ నెంబర్లు, 9 ఏటీఎం కార్డులు

ఖరీదైన కారు, నాలుగు ఫోన్ నెంబర్లు, 9 ఏటీఎం కార్డులు

నిందితుడి నుంచి లక్షల రూపాయల విలువైన ఖరీదైన కారు, వివిద బ్యాంకులకు చెందిన 9 ఏటీఎం కార్డులు, నాలుగు సిమ్ లతో ఉపయోగిస్తున్న రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లు, డబ్బు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు అన్నారు. మ్యాట్రీమోనీలో పరిచయం అయిన మహిళలను బర్హాత్ తసీర్ ఖాన్ తాను అనాథ అని, వ్యాపారం చేస్తున్నానని, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఒకే డైలాగ్ చెప్పి అందరిని మోసం చేశాడని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+