Khiladi girls: ఇంట్లో దూరి ప్యాంట్ విప్పించి..... ? వీడియో తీసి, ఒకేసారి ముగ్గురు, రూ. 5 లక్షలు !

హర్యానా/హైదరాబాద్: యవ్వనంలో ఎర్రగా, నాజుకుగా ఉంటున్న ముగ్గురు కిలాడీ లేడీలు అమాయకులైన వారిని నగ్నంగా చేసి వారి న్యూడ్ వీడియోలు, ఫోటోలు తీసి నిలువుదోపిడీలు చేస్తున్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి ఈ రోజు ఎవరికి పంగనామాలు పెడుదామా అంటూ ముగ్గరు స్కెచ్ లు వేస్తున్నారు. కొడుకు విదాశాల్లో ఉండటంతో అతని తండ్రి మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇంట్లో వృద్దుడు ఒంటరిగా ఉన్నాడని తెలుసుకున్న ముగ్గురు కిలాడీలు ఆయన ఇంటికి వెళ్లారు. మేము మహిళా పోలీసులు అంటూ ఆయన ప్యాంట్ తో పాటు బట్టలు పూర్తిగా విప్పించి బెదిరించి ఆయన నగ్న వీడియోలు తీసి రూ. 5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు.

 కొడుకు విదేశాల్లో

కొడుకు విదేశాల్లో

హర్యానాలోని యమునా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన ఇప్పుడు ఆ రాష్ట్రాంలో హాట్ టాపిక్ అయ్యింది. యమునాలోని న్యూ హమీదా కాలనీలో బాబు (పేరు మార్చడం జరిగింది) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. బాబు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నాడు. బాబు తండ్రి మాత్రమే న్యూ హమీదా కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు.

 ఇంట్లోకి కిలాడీ ఎంట్రీ

ఇంట్లోకి కిలాడీ ఎంట్రీ

బాబు తండ్రి ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో ఓ కిలాడీ లేడీ లోపలికి వెళ్లింది. తాను యమునా పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీసుగా ఉద్యోగం చేస్తున్నానని పరిచయం చేసుకునింది. తరువాత బాబు తండ్రితో చనువుగా ఉంటున్నట్లు నటించిన ఆ కిలాడీ లేడి ఆయన్ను ప్యాంటు తీసేయమని చెప్పింది.

 మరో ఇద్దరు యువతులు వెళ్లి హంగామా

మరో ఇద్దరు యువతులు వెళ్లి హంగామా

బాబు తండ్రి దగ్గర ఓ యువతి బలవంతంగా ప్యాంటు విప్పించింది. ఆ సమయంలో మరో ఇద్దరు కిలాడీ లేడీలు బాబు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్యాంటు తీసి నిలబడి ఉన్న ఆ వృద్దుడిని కొట్టడానికి ప్రయత్నించారు. ఎవరో అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ప్యాంట్ విప్పి ఏమి చేస్తున్నావు ? అంటూ ఆ ఇద్దరు కిలాడీ లేడీలు ఆయన ముందు నానా హంగామా చేశారు.

 రూ. 5 లక్షలు డిమాండ్

రూ. 5 లక్షలు డిమాండ్

మేము ముగ్గురూ మహిళా పోలీసులు అంటూ కిలాడీలు బాబు తండ్రిని బెదిరించారు. బాబు తండ్రిని నగ్నంగా తయారు చేసిన ఆముగ్గురు మూడు మొబైల్ ఫోన్లలో ఆయన నగ్న వీడియోలు తీశారు. తరువాత మాకు రూ. 5 లక్షలు ఇస్తే ఈ వీడియోలు డిలీట్ చేస్తామని, లేదంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, విదేశాల్లో ఉన్న నీకొడుకు అక్కడి నుంచే నీ వీడియోలు చూస్తాడని ఆయన్ను బ్లాక్ మెయిల్ చేశారు.

 అడ్వాన్స్ గా రూ. 50 వేలు

అడ్వాన్స్ గా రూ. 50 వేలు

బాబు తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి ఆయనకు నిద్రరాకుండా చేసిన ముగ్గురు కిలాడీలు ఆయన దగ్గర రూ. 50 వేలు లాక్కొన్నారు. మిగిలిన రూ. 4. 50 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చెయ్యడంతో బాబు తండ్రి యమునా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యమునా పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న మహిళా పోలీసులు అందరిని చూసిన ఆయన తన దగ్గర డబ్బులు తీసుకున్నది వీళ్లు కాదు అని చెప్పాడు.

 ఎగరేసుకుంటూ వెళ్లిన కిలాడీలు అరెస్టు

ఎగరేసుకుంటూ వెళ్లిన కిలాడీలు అరెస్టు

పోలీసులు పక్కా స్కెచ్ వేసి ఆ డబ్బులు తీసుకోవడానికి రావాలని ఆ యువతులకు ఆ వృద్దుడితో ఫోన్ చేపించారు. డబ్బులు తీసుకోవడానికి ఎగరేసుకుంటూ వచ్చిన ముగ్గురు కిలాడీలను యమునా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముగ్గురు కిలాడీల పేర్లు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. ముగ్గురిని కోర్టు ముందు హాజరుపరిచి విచారణ చేస్తున్నామని యమునా పోలీసులు అంటున్నారు. వృద్దుడిని నగ్నంగా చేసి వీడియోలు తీసి అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేశారని వెలుగు చూడటం హర్యానాలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+