khiladi: భార్య 14 ఏళ్లు చిన్నది, అందంగా ఉందని ?, చంపేసి ఇంట్లో పూడ్చేసి పైన డబుల్ కాట్ బెడ్ !

బెంగళూరు/చిత్రదుర్గ: ఇద్దరి మద్య 14 ఏళ్ల తేడా ఉన్నా వారి కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. మొదట భార్యతో చక్కగా సంసారం చేసిన ఆమె భర్త తరువాత ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. తన భార్య చూడటానికి అందంగా ఉంటుందని, ఆమె తనకంటే తక్కువ వయసులో ఉందని, నేను ఇంట్లో లేని సమయంలో ఏదో జరుగుతోందని అనుమానం పెంచుకున్నాడు. రానురాను భార్య మీద అనుమానం ఎక్కువ అయ్యింది. ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకున్న భర్త ఆమెను దారుణంగా చంపేశాడు .ఇంట్లోనే గొయ్యి తీసి భార్య శవాన్ని పూడ్చేసి నీట్ గా సిమెంట్ తో ప్లాసింగ్ చేసేశాడు. సిమెంట్ ప్లాస్టింగ్ కొత్తగా చేసిన విషయం బయటకు కనపడకుండా ఉండాలని భార్య శవం పూడ్చి పెట్టిన చోట డబుల్ కాట్ బెడ్ వేసిన భర్త చేతులు దులుపుకున్నాడు.

 దంపతుల మద్య 14 ఏళ్లు తేడా

దంపతుల మద్య 14 ఏళ్లు తేడా

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని సిరిగెరె సమీపంలోని కోణనూరు గ్రామంలో ఆర్. నారప్ప అలియాస్ నారప్ప (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. విజయనగర జిల్లాలోని పరపనహళ్ళి తాలుకా బెణ్ణహళ్ళి గ్రామంలో నివాసం ఉంటున్న సుమా (26) అనే యువతితో నారప్ప వివాహం జరిపించాలని పెద్దలు మాట్లాడుకున్నారు. నారప్ప, సుమాల మద్య 14 సంవత్సరాల తేడా ఉన్నా పెద్దలు ఏమాత్రం పట్టించుకోకుండా కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరి వివాహం జరిపించేశారు.

 భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం


కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న నారప్ప, సుమా దంపతులకు నారదముని (5) అనే కొడుకు ఉన్నాడు. మొదట భార్య సుమాతో చక్కగా సంసారం చేసిన ఆమె భర్త నారప్పకు తరువాత ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. తన భార్య సుమా చూడటానికి అందంగా ఉంటుందని నారప్పకు అనుమానం మొదలైయ్యింది.

 అందంగా ఉంది, వయసులో చిన్నది, ఇంట్లో ?

అందంగా ఉంది, వయసులో చిన్నది, ఇంట్లో ?


నా భార్య సుమా తనకంటే తక్కువ వయసులో ఉందని, నేను ఇంట్లో లేని సమయంలో ఏదో జరుగుతోందని నారప్ప విపరీతంగా అనుమానం పెంచుకున్నాడు. రానురాను భార్య సుమా మీద ఇదే విషయంలో అనుమానం పెంచుకోవడంతో దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయ.

భార్యను ఇంట్లో పూడ్చేసి పైన డబుల్ కాట్ బెడ్

భార్యను ఇంట్లో పూడ్చేసి పైన డబుల్ కాట్ బెడ్

ఇంట్లో భార్య సుమాతో గొడవ పెట్టుకున్న నారప్ప ఆమెను దారుణంగా చంపేశాడు ఇంట్లోనే గొయ్యి తీసి భార్య సుమా శవాన్ని పూడ్చేశాడు. సుమా శవం పూడ్చి పెట్టిన ప్రాంతంలో నీట్ గా సిమెంట్ తో ప్లాసింగ్ చేసేశాడు. సిమెంట్ ప్లాస్టింగ్ కొత్తగా చేశారని బయట వాళ్లకు విషయం బయట పడకూడదని భార్య సుమా శవం పూడ్చి పెట్టిన చోట డబుల్ కాట్ బెడ్ వేసిన నారప్ప చేతులు దులుపుకున్నాడు.

 తల్లిని హత్య చేసిన తండ్రిని పట్టించిన కొడుకు

తల్లిని హత్య చేసిన తండ్రిని పట్టించిన కొడుకు

తన భార్య సుమా కనపడటం లేదని, ఎవరికైనా కనపడితే తనకు ఫోన్ చేసి చెప్పాలని నారప్ప ఊర్లో అందరి దగ్గర నాటకాలు ఆడాడు. సుమాను హత్య చేసిన తరువాత నారప్ప అతని కొడుకు నాగమునిని పిలుచుకుని వెళ్లి అతని అత్తారింటిలో వదిలిపెట్టాడు. నాగమునిని సుమా తండ్రి విచారణ చెయ్యగా రెండు రోజుల పాటు మా నాన్న ఇంట్లో సిమెంట్ పని చేస్తున్నాడని చెప్పాడు.

 మామకు పూర్తిగా అనుమానం

మామకు పూర్తిగా అనుమానం

సుమా కనపడకపోవడం, ఇంట్లో ఫ్లోరింగ్ పని జరిగిందని మనుమడు చెప్పడంతో సుమా తండ్రికి అనుమానం మొదలైంది. నా బిడ్డ ఎక్కడ అని సుమా తండ్రి అల్లుడు నారప్పను ప్రశ్నిస్తే అతను పొంతనలేని సమాధానం చెప్పాడు. సుమా తండ్రికి ఇంకా అనుమానం పెరిగిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

    'Father Knows Who The Father Is' - TMC MP Nusrat Jahan || Oneindia Telugu
    ఉరి వెయ్యాలని శాపనార్తాలు

    ఉరి వెయ్యాలని శాపనార్తాలు

    పోలీసులు నారప్పను అదుపులోకి తీసుకుని నార బయటకు పీకడంతో జరిగిన స్టోరీ మొత్తం బయటకు వచ్చింది. నారప్ప ఇంట్లో తొవ్విన పోలీసులు సుమా శవాన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. భార్య సుమాను అతి దారుణంగా చంపేసిన నారప్పను ఉరి తియ్యాలని స్థానికులు పోలీసులకు మనవి చేశారు. మొత్తం మీద నారప్ప అతని భార్య సుమాను చంపిన తీరు తెలుసుకున్న స్థానికులతో పాటు కన్నడిగులు షాక్ అయ్యారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+