Khiladi: బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి సొంత కూతుర్ని అపార్ట్ మెంట్ లో కిడ్నాప్ చేయించిన కన్నింగ్ లేడీ, రివర్స్!

గురుగ్రామ్/న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తోంది. మహిళకు ఓ కుమార్తె ఉంది. మహిళ వ్యాపారం చేస్తోంది. మహిళ కూతురు సాటి స్నేహితులతో కలిసి ప్రతిరోజు ఆడుకోవడానికి వెళ్లి వస్తోంది. మహిళ నివాసం ఉంటున్న ఇంటి సమీపంలోని స్నేహితురాలి ఇంటిలో శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యానికి మహిళ, ఆమె కూతురు వెళ్లారు.

రాత్రి మహిళ కుమార్తె, అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మరో అమ్మాయి కిడ్నాప్ అయ్యారు. రూ. 50 లక్షలు ఇవ్వకుంటే ఇద్దరు అమ్మాయిలను చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. రంగంలోకి దిగిన పోలీసులు పక్కాప్లాన్ తో కిడ్నాపర్లను పట్టుకున్నారు. కిడ్నాపర్ల కింగ్ పిన్ ఓ అమ్మాయి తల్లి అని వెలుగు చూడటంతో పోలీసులతో పాటు స్థానికులు బిత్తరపోయారు.

వ్యాపారం చేస్తున్న మహిళ

వ్యాపారం చేస్తున్న మహిళ

ఉత్తరప్రదేశ్ లోని గురుగ్రామ్ లో రింకీ అనే మహిళ నివాసం ఉంటున్నది. రింకీకి 9 సంవత్సరాల వయసు ఉన్న కూతురు ఉంది. రింకీ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తోంది. రంకీ కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తోంది. రింకీ కూతురు సాటి స్నేహితులతో కలిసి ప్రతిరోజు ఆడుకోవడానికి సమీపంలోని అపార్ట్ మెంట్ లోని స్నేహితుల ఇళ్లకు వెళ్లి వస్తోంది.

రూ. 26 లక్షలు అప్పులు

రూ. 26 లక్షలు అప్పులు

వ్యాపారం చేస్తున్న రింకీ రూ. 26 లక్షలకు పైగా అప్పులు చేసింది. వ్యాపారంలో నష్టం రావడంతో రింకీ సతమతం అయ్యింది. అప్పులు ఇచ్చిన వాళ్లు రింకీ మీద ఒత్తిడి చేశారు. భర్త దగ్గర డబ్బులు అడిగే ధైర్యం లేకపోవడంతో రింకీ కొంతకాలంగా నానా ఇబ్బందులు ఎదుర్కొనింది. పరిచయం ఉన్న కారు డ్రైవర్ అజయ్, డాబాలో పని చేస్తున్న సాగర్ అనే వ్యక్తితో కలిసి రింకీ కిలాడీ స్కెచ్ వేసింది.

అపార్ట్ మెంట్ లో శుభకార్యం

అపార్ట్ మెంట్ లో శుభకార్యం

రింకీ నివాసం ఉంటున్న ఇంటి సమీపంలోని స్నేహితురాలు నివాసం ఉంటున్న ఏక్తా ఎన్ క్లే వ్ అపార్ట్ మెంట్ లో ఈనెల 10వ తేదీన శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యానికి రింకీతో పాటు ఆమె 9 ఏళ్ల కూతురు వెళ్లారు. రింకీ ఆమె బాయ్ ఫ్రెండ్స్ అజయ్, సాగర్ ను ఆ శుభకార్యానికి పిలుచుకుని వెళ్లింది.

కూతుర్ని కిడ్నాప్ చేయించిన రింకీ

కూతుర్ని కిడ్నాప్ చేయించిన రింకీ

రాత్రి తన 9 ఏళ్ల కూతురు, అపార్టె మెంట్ లో నివాసం ఉంటున్న 14 ఏళ్ల అమ్మాయిని పిలిచి అజయ్ అంకుల్ మీకు ఐస్ క్రీమ్ తీసిస్తాడు వెళ్లండి అంటూ అపార్ట్ మెంట్ బయటకు పంపించింది. అదే రోజు రాత్రి రింకీ కుమార్తె, అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న 14 ఏళ్ల అమ్మాయి కిడ్నాప్ అయ్యారు. రూ. 50 లక్షలు ఇవ్వకుంటే ఇద్దరు అమ్మాయిలను చంపేస్తామని కిడ్నాపర్లు రింకీని, మరో మహిళను బెదిరించారు.

బిత్తరపోయిన పోలీసులు

బిత్తరపోయిన పోలీసులు

డబ్బులు ఇచ్చేసి మనపిల్లల్ని కాపాడుకుందామని రింకీ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే మ్యాటర్ పోలీసులకు వరకు వెళ్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు పక్కాప్లాన్ తో కిడ్నాపర్లను పట్టుకున్నారు. కిడ్నాపర్ల కింగ్ పిన్ 9 ఏళ్ల అమ్మాయి తల్లి రింకీ అని వెలుగు చూడటంతో పోలీసులతో పాటు స్థానికులు బిత్తరపోయారు.

అందుకే ఇలా చేశాను: రింకీ

అందుకే ఇలా చేశాను: రింకీ

చేసిన రూ. 26 లక్షల అప్పు తీర్చడానికి కన్న కూతురితో పాటు స్నేహితురాలి కూతుర్ని రింకీ కిడ్నాప్ చేయించిందని పోలీసులు అన్నారు. రింకితో పాటు కిడ్నాపర్లు అజయ్ సాగర్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. చేసిన అప్పులు తీర్చడానికి తాను సొంత కూతుర్ని కిడ్నాప్ చేశానని రింకీ అంగీకరించిందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+