Khiladi lovers: ఐటీ హబ్ లో స్కెచ్, Tolet బోర్డు కనపడితే దూరేస్తున్న లవర్స్, సీన్ కట్ చేస్తే !

బెంగళూరు: నేర చరిత్ర ఉన్న యువకుడు పదేపదే జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వస్తున్నాడు. క్రిమినల్ మైండ్ ఉన్న అతను ఎక్కడ పని చెయ్యడానికి సిద్దంగా లేడు. పోలీసులు రౌడీషీటర్స్ జాబితాలో ఇప్పటికే వీడి పేరు చేర్చేశారు. ఫోజులు కొడుతున్న రౌడీషీటర్ వలలో పడిన ఓ యువతి అతనితో ఎంజాయ్ చేస్తోంది. ప్రియురాలికి ఖరీదైన బహుమతులు తీసిచ్చి ఆమెను జాలీ రైడ్ కు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్న రౌడీషీటర్ కు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి. ఇటీవల కాలంలో రౌడీషీటర్ కు బైక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇబ్బందులు ఎదురైనాయని తెలిసింది. రౌడీషీటర్ ఓ కొత్త టెక్నిక్స్ తో డబ్బు సంపాధించాలని ఆలోచించాడు. ప్రియుడి క్రిమినల్ మైండ్ గేమ్ కు అతని ప్రియురాలు సహకరించింది. అంతే ఐటీ హబ్ లో Tolet బోర్డు కనపడితే చాలు ఆ ఇంటిలో దూరేస్తున్న ప్రేమికులు వెళ్లిన పని పూర్తి చేసుకుని సైలెంట్ గా చెక్కేస్తున్నారు. కిలాడీ ప్రేమికులు ఏం చేశారు అనే విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఇంటి యజమాని పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ మొదలైయ్యింది.

 బెంగళూరులో చోటా రౌడీషీటర్

బెంగళూరులో చోటా రౌడీషీటర్

ఐటీ హబ్ బెంగళూరులోని రాజాజీనగర్ లో వినయ్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాజాజీనగర్ తో పాటు బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వినయ్ మీద అనేక కేసులు ఉన్నాయి. నేర చరిత్ర ఉన్న వినయ్ అనేక కేసుల్లో పదేపదే జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వస్తున్నాడు. బసవేశ్వర్ నగర్ పోలీసులు రౌడీషీటర్స్ జాబితాలో ఇప్పటికే వినయ్ పేరు చేర్చేశారు.

 పోటుగాడి ఫోజులు చూసి వలలో పడిన యువతి

పోటుగాడి ఫోజులు చూసి వలలో పడిన యువతి

వినయ్ బైక్ లో తిరుగుతూ స్థానికంగా అమాయకులైన వారిని బెదిరించి కాలం గడిపేస్తున్నాడు. నేర చరిత్ర ఉన్న వినయ్ ఎక్కడా పని చెయ్యడానికి సిద్దంగా లేడు. అసలు వినయ్ గురించి తెలిసిన వాళ్లు వాడికి పని ఇవ్వడానికి భయపడిపోతున్నారు. ఫోజులు కొడుతు తిరుగుతున్న వినయ్ వలలో కీర్తనా (25) అనే యువతి పడిపోయింది.

 జాలీ రైడ్.... ప్రియారాలికికి ఖరీదైన గిఫ్ట్స్

జాలీ రైడ్.... ప్రియారాలికికి ఖరీదైన గిఫ్ట్స్

వినయ్ వలలో పడిపోయిన అతని ప్రియురాలు కీర్తనా అతను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లడం మొదలు పెట్టింది. ప్రియురాలు కీర్తనాను విహారయాత్రలకు పిలుచుకుని వెలుతున్న వినయ్ ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. ప్రియురాలు కీర్తనాకు ఖరీదైన బహుమతులు తీసిచ్చి ఆమెను జాలీ రైడ్ కు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్న రౌడీషీటర్ వినయ్ కి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి.

 ప్రియుడికి సపోర్ట్ చేసిన ప్రియురాలు

ప్రియుడికి సపోర్ట్ చేసిన ప్రియురాలు

ఇటీవల కాలంలో రౌడీషీటర్ వినయ్ కి బైక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇబ్బందులు ఎదురైనాయని తెలిసింది. రౌడీషీటర్ వినయ్ ఓ కొత్త టెక్నిక్స్ తో డబ్బు సంపాధించాలని ఆలోచించాడు. మనం ఇద్దరూ కలిసి ఇళ్లల్లో ఖరీదైన వస్తువులు చోరీ చేద్దామని, వచ్చిన డబ్బుతో జల్సా చేద్దామని వినయ్ అతని ప్రియురాలు కీర్తనాకు చెప్పాడు. ప్రియుడు వినయ్ క్రిమినల్ మైండ్ గేమ్ కు అతని ప్రియురాలు కీర్తనా కూడా సహకరించింది.

 టూ లెట్ బోర్డు కనపడితే చాలు దూరేస్తున్నారు

టూ లెట్ బోర్డు కనపడితే చాలు దూరేస్తున్నారు

ఐటీ హబ్ లో Tolet బోర్డు కనపడితే చాలు ఆ ఇంటిలో దూరేస్తున్న ప్రేమికులు వెళ్లిన పని పూర్తి చేసుకుని సైలెంట్ గా చెక్కేస్తున్నారు. మూడు రోజుల క్రితం బెంగళూరులోని మారుతి నగర్ లోని కులశేఖర్ అనే వ్యక్తి ఇంటి బయట టూ లెట్ బోర్డు చూసిన వినయ్, కీర్తనా ఇల్లు చూసే నెపంతో వారి ఇంటిలోకి వెళ్లారు.

 మాటల్లో దింపేసి ల్యాప్ టాప్ నొక్కేశారు

మాటల్లో దింపేసి ల్యాప్ టాప్ నొక్కేశారు

ఇల్లు చూసిన తరువాత అద్దె ఎంత, అడ్వాన్స్ ఎంత అని కులశేఖర్ ను వినయ్, కీర్తనా మాటల్లో దింపారు. ఆ సమయంలో కులశేఖర్ ఇంటిలో విలువైన ల్యాప్ టాప్ చోరీ చేసిన వినయ్, కీర్తనా అక్కడి నుంచి సైలెంట్ గా బయటకు వెళ్లిపోయి అక్కడ ఉన్న బైక్ లో చెక్కేశారు. తరువాత ల్యాప్ టాప్ చోరీ అయ్యిందని కులశేఖర్ గుర్తించాడు.

 ప్రియుడి మోజులో జైలుపాలైన ప్రియురాలు

ప్రియుడి మోజులో జైలుపాలైన ప్రియురాలు

కిలాడీ ప్రేమికులు ఏం చేశారు అనే విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన విషయం చూసిన ఇంటి యజమాని కులశేఖర్ తరువాత పోలీసులను ఆశ్రయించాడు. కులశేఖర్ కేసు పెట్టడంతో సీసీటీవీ పుటేజీల ఆధారం గాలించిన పోలీసులు వినయ్, అతని కిలాడీ ప్రియురాలు కీర్తనాను అరెస్టు చేసి విచారణ చేశారు. ప్రియుడు వినయ్ మోజులో పడి అతని క్రిమినల్ మైండ్ కు సహకరించిన కీర్తనా ఇప్పుడు జైలుపాలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+