Khiladi: కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన భార్య, భార్య అక్క కూతురితో భర్త ?, మ్యాటర్ లీక్ అయ్యిందని !
బెంగళూరు/ మైసూరు: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. భార్య గర్బవతి కావడంతో ఆమెను సంతోషంగా ఉండేలా చూసుకుంటున్న భర్త అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఇదే సమయంలో భార్యను కాన్పుకు ఆమె పుట్టింటికి పంపించాడు. భార్య ఇంట్లో లేకపోవడంతో భర్త జల్సా చేస్తున్నాడు. భార్య సమీప బంధువు అయిన అమ్మాయి ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన కామాంధుడు రహస్యంగా కొన్ని ఫోటోలు తీశాడు. తరువాత అమ్మాయికి ఆ ఫోటోలు చూపించిన కామాంధుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమె మీద పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. మైనర్ అమ్మాయి గర్బవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆసుపత్రి ల్యాబ్ నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ అమ్మాయి గర్బవతి అయిన విషయం వెలుగు చూసింది. విషయం పోలీసులకు తెలిసిపోయిందని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తారని భయపడిన కామాంధుడు విషం సేవించడం కలకలం రేపింది.

భార్యతో హ్యాపీగా ఉంటున్నాడు
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని హారాపుర గ్రామంలో ప్రదీప్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన రేవతి (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. రేవతిని వివాహం చేసుకున్న ప్రదీప్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

గర్బవతి కావడంతో పుట్టింటిలో భార్య
భార్య రేవతి గర్బవతి కావడంతో ఆమెను సంతోషంగా ఉండేలా చూసుకుంటున్న ప్రదీప్ బంధువులతో పాటు అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఇదే సమయంలో భార్య రేవతి నిండు గర్బవతి కావడంతో ఆమెను కాన్పుకు పుట్టింటికి పంపించాడు. భార్య రేవతి ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్త ప్రదీప్ రోజూ మద్యం సేవిస్తూ స్నేహితులతో కలిసి జల్సా చేస్తున్నాడు.

మైనర్ అమ్మాయి మీద అత్యాచారం
భార్య రేవతి ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్త ప్రదీప్ జల్సా చేస్తున్నాడు. భార్య రేవతి సమీప బంధువు అయిన 14 ఏళ్ల అమ్మాయి ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన కామాంధుడు ప్రదీప్ రహస్యంగా కొన్ని ఫోటోలు తీశాడు. తరువాత అమ్మాయికి ఆ ఫోటోలు చూపించిన కామాంధుడు ప్రదీప్ ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమె మీద పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు.

7 నెలల గర్బవతి
మైనర్ అమ్మాయి గర్బవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించడానికి మైసూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రయత్నాలు చేశాడు. మైసూరులోని ఆసుపత్రి ల్యాబ్ నిర్వహకులు మైనర్ అమ్మాయి గర్బవతి అయిన విషయం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తరువాత ప్రదీప్ కారణంగా ఆ అమ్మాయి గర్బవతి అయిన విషయం వెలుగు చూసింది. విషయం పోలీసులకు తెలిసిపోయిందని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తారని భయపడిన కామాంధుడు ప్రదీప్ విషం సేవించడం కలకలం రేపింది.

ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
ప్రదీప్ ను మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని, అమ్మాయిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించి కేసు విచారణ చేస్తున్నామని నంజనగూడు పోలీసు అధికారులు తెలిపారు. మైనర్ అమ్మాయి 7 నెలల గర్బవతి అయ్యిందని, నిందితుడు ప్రదీప్ మీద ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications