బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi: కేజీ నగలు, రూ. 10 లక్షల క్యాష్ తో పెళ్లి కూతురు జంప్, ఫస్ట్ నిశ్చితార్థం క్యాన్సిల్, గోవింద !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కుటుంబ సభ్యులు ఓ అమ్మాయితో పెళ్లి సంబంధం ఫిక్స్ చేసి గ్రాండ్ గా నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజుల తరువాత కొన్ని అనివార్య కారణాలతో ఆ నిశ్చితార్థం రద్దు అయ్యింది. వేరే అమ్మాయితో మళ్లీ ఆ యువకుడికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. నిశ్చితార్థం అచ్చురాలేదని ఏకంగా లక్షలు ఖర్చు చేసి గ్రాండ్ గా పెళ్లి చేశారు. ఇంటికి వస్తున్న కోడలికి అబ్బాయి కుటుంబ సభ్యులు లక్షల రూపాయల విలువైన బంగారు నగలు చేయించి ఎదురుకట్నం ఇచ్చారు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే పెళ్లి కూతురు అత్తారింటి వాళ్లు ఇచ్చిన బంగారు నగలతో పాటు భారీ మొత్తంలో నగదు ఎత్తుకుని పరార్ కావడం భర్త కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.

Wife: భార్యను నిద్రలేపి పిలుచుకుని వెళ్లాడు. ఎక్స్ ప్రెస్ రైలుకింద తోసేసి చంపేసిన శాడిస్టు భర్త, సీసీటీవీల్లోWife: భార్యను నిద్రలేపి పిలుచుకుని వెళ్లాడు. ఎక్స్ ప్రెస్ రైలుకింద తోసేసి చంపేసిన శాడిస్టు భర్త, సీసీటీవీల్లో

 బెంగళూరులో నిశ్చితార్థం క్యాన్సిల్

బెంగళూరులో నిశ్చితార్థం క్యాన్సిల్

బెంగళూరులోని పద్మనాభనగర్ లో కమల అనే మహిళ నివాసం ఉంటున్నారు. కమల కుమారుడు రంజిత్ (పేరు మార్చడం జరిగింది) అనే కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం కమల కుటుంబ సభ్యులు ఓ అమ్మాయితో రంజిత్ పెళ్లి నిశ్చయించారు. కమల కుటుంబ సభ్యులు ఓ అమ్మాయితో పెళ్లి సంబంధం ఫిక్స్ చేసి గ్రాండ్ గా రంజిత్ నిశ్చితార్థం చేశారు.

 పెళ్లి కూతురు మారిపోయింది

పెళ్లి కూతురు మారిపోయింది

నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజుల తరువాత కొన్ని అనివార్య కారణాలతో రంజిత్ నిశ్చితార్థం రద్దు అయ్యింది. కొంతకాలం తరువాత గౌతమి అనే యువతితో రంజిత్ పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. గతంలో రంజిత్ కు నిశ్చితార్థం జరిగి రద్దు అయ్యిందని పూర్తి సమాచారంతెలుసుకున్న గౌతమి కుటుంబ సభ్యులు ఆ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 గ్రాండ్ గా పెళ్లి చేశారు

గ్రాండ్ గా పెళ్లి చేశారు

నిశ్చితార్థం అచ్చురాలేదని ఏకంగా లక్షలు ఖర్చు చేసి గ్రాండ్ గా రంజిత్, గౌతమిల వివాహం జులై 10వ తేదీన బెంగళూరులోని బనశంకరిలోని ఓ విలాసవంతమైన కల్యాణమండపంలో పెళ్లి చేశారు. ఇంటికి వస్తున్న కోడలు గౌతమికి రంజిత్ తల్లి కమల కుటుంబ సభ్యులు లక్షల రూపాయల విలువైన బంగారు నగలు చేయించి ఎదురుకట్నంగా ఇచ్చారు.

 పెళ్లి కూతురు జంప్

పెళ్లి కూతురు జంప్

రంజిత్ తో పెళ్లి జరిగిన కొన్ని రోజులకే పెళ్లి కూతురు గౌతమి అత్తారింటి వాళ్లు ఇచ్చిన బంగారు నగలతో పాటు భారీ మొత్తంలో అత్తారింటిలో నగదు ఎత్తుకుని పరార్ అయ్యింది. బంగారు నగలు, రూ. 10 లక్షల నగదుతో గౌతమి పారిపోయిందని తెలుసుకున్న ఆమె భర్త రంజిత్ కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.

 కోడలి మీద కేసు పెట్టిన అత్త

కోడలి మీద కేసు పెట్టిన అత్త

మేము చేయించిన బంగారు నగలతో పాటు భారీ మొత్తంలో నగదు లూటీ చేసిన మా కోడులు గౌతమి పారిపోయిందని అత్త కమల బెంగళూరులోని బనశంకరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు నుంచి తన కోడలు గౌతమి తనకు ఎదురు తిరగడం మొదలుపెట్టిందని, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తే వరకట్నం కేసు పెడుతానని మమ్మల్ని బెదిరించిదని కమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిలాడీ లేడీ గౌతమి కోసం గాలిస్తున్నారు.

English summary
Khiladi: Newly wed girl escapes with money and jewelry mother in law files complaint in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X