Khiladi: నిక్కర్ ఫ్రెండ్స్, బైక్ లు చోరీ, రూ. లక్షలు సంపాధిస్తున్న మెకానిక్ లు, సీసీటీవీల్లో !
బెంగళూరు: బైక్ లు రిపేర్ చేస్తున్న ఇద్దరు మెకానిక్ లు డబ్బులు బాగానే సంపాధిస్తున్నారు. స్కూటర్లు, బైక్ లు ఎలా రిపేర్ చెయ్యాలి అనే విషయంలో ఆరితేరిన ఇద్దరు మెకానిక్ లు త్వరగా డబ్బులు సంపాధించాలని ఆలోచించారు. ఇద్దరు స్నేహితులు కావడంతో కొంతకాలం సాయంత్రం పని పూర్తి అయిన తరువాత మద్యం సేవిస్తూ అనేక స్కెచ్ లు వేశారు. చేతిలో ఉన్న మెకానిక్ పనినే పెట్టుబడిగా పెట్టి ఉద్దరగా డబ్బులు సంపాధించాలని ఆలోచించారు. బెంగళూరులో వాహనాలు పార్కింగ్ చేసే విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 60 శాతం మంది ప్రజలు వాళ్ల ఇంటి ముందు బైక్ లు పార్క్ చేస్తున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన ఖరీదైన బైక్ లు చాకచక్యంగా చోరీ చేస్తున్న మెకానిక్ లు వాటిని విక్రయిస్తూ రూ. లక్షల్లో డబ్బులు సంపాధిస్తున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ లు వరుసగా చోరీ అవుతుండటంతో వాటి యజమానులు హడలిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

బెంగళూరులో మెకానిక్ ఫ్రెండ్స్
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని మైసూరు రోడ్డులోని టీఆర్ మిల్ సమీపంలో రామదాస్, శరవణ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు శరవణ, రామ్ దాస్ ఇద్దరూ స్కూటర్ మెకానిక్ లు గా పని చేస్తున్నారు. బైక్ లు రిపేర్ చేస్తున్న రామదాస్, శవరణ ఇద్దరు మెకానిక్ లు డబ్బులు బాగానే సంపాధిస్తున్నారు.

డబ్బు మీద ఆశ ఎక్కువ అయ్యింది
స్కూటర్లు, బైక్ లు ఎలా రిపేర్ చెయ్యాలి అనే విషయంలో ఆరితేరిన శరవణ, రామ్ దాస్ ఇద్దరు మెకానిక్ లు త్వరగా డబ్బులు సంపాధించాలని ఆలోచించారు. రామ్ దాస్, శరవణ ఇద్దరు స్నేహితులు కావడంతో కొంతకాలం సాయంత్రం పని పూర్తి అయిన తరువాత మద్యం సేవిస్తూ అనేక స్కెచ్ లు వేశారు.

ఇంటి ముందు స్కూటర్ల మీద కన్ను వేసిన కిలాడీలు
చేతిలో ఉన్న మెకానిక్ పనినే పెట్టుబడిగా పెట్టి ఉద్దరగా డబ్బులు సంపాధించాలని రామ్ దాస్, శరవణ ఆలోచించారు. బెంగళూరులో వాహనాలు పార్కింగ్ చేసే విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 60 శాతం మంది ప్రజలు వాళ్ల ఇంటి ముందు బైక్ లు పార్క్ చేస్తున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన ఖరీదైన బైక్ లు చాకచక్యంగా చోరీ చేస్తున్న మెకానిక్ లు రామ్ దాస్, శరవణ వాటిని విక్రయిస్తూ రూ. లక్షల్లో డబ్బులు సంపాధించడం మొదలు పెట్టారు.
Recommended Video

సీసీటీవీ కెమెరాల్లో
బెంగళూరులోని చామరాజపేట, కెంపేగౌడ, కుమారస్వామి లేఔట్, చంద్రాలేఔట్ లో వరుసగా బైక్ లు చోరీ అవుతున్నాయి. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ లు వరుసగా చోరీ అవుతుండటంతో వాటి యజమానులు హడలిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. స్కూటర్ మెకానిక్ లు రామ్ దాస్, శరవణ రాత్రి పూట ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ లు చోరీ చేసి విక్రయిస్తున్నారని వెలుగు చూసింది. నిందితులను అరెస్టు చేసి రూ. 11. 45 లక్షల విలువైన 20 బైక్ లు స్వాధీనం చేసుకున్నామని చామరాజపేట పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications