Khiladi wife: భర్తను దుప్పటిలో చుట్టేసి 25 ఎముకలు విరిచేసిన భార్య, కోట్ల ఆస్తి కోసం, చనిపోయాడని !

బెంగళూరు: బార్యతో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్న భర్త వ్యాపారం చేస్తున్నాడు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. దంపతుల మద్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్న భర్తకు అతని రెండో భార్య కారణంగా అనేక ఇబ్బందులు ఎదురైనాయి. భర్త పేరుతో కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉంది. ఆస్తి తన పేరుతో రాసివ్వాలని భార్య చాలా కాలం నుంచి పీడిస్తోంది. ఆస్తి భార్య పేరుతో రాసివ్వడానికి ఆమె భర్త నిరాకరించాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే భర్తను పట్టుకుని అతని భార్య మూడుసార్లు చితకబాదింది. చివరికి భర్త ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే అతని భార్య తలుపులు మూసేసింది. ఇంట్లో భర్తను పట్టుకుని చితకబాదేసింది. భార్య దెబ్బలు తట్టుకోలేక భర్త బెడ్ రూమ్ లోకి వెళ్లి కుమిలిపోయి తరువాత నిద్రపోయాడు. అర్దరాత్రి భార్య బెడ్ రూమ్ లో ఉన్న భర్త కదలకుండా దుప్పటిలో చెట్టేసింది. అంతే పెద్ద ఇనుపరాడ్ తీసుకున్న భార్య ఆమె భర్తను చితకబాదేసింది, తరువాత ముఖానికి టవల్ చుట్టేసి పెద్ద కర్రతీసుకుని దాడి చేసింది. భార్య కొట్టిన దెబ్బలకు ఆమె భర్త కాళ్లు, చేతులు, వెన్నుతో పాటు శరీరంలోని 25 ఎముకలు విరిగిపోయాయి. భర్త ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. రౌడీపెళ్లామ్ మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చెయ్యడంతో కిలాడీ భార్య పరారైయ్యింది.

మొదటి భార్యతో విడాకులు

మొదటి భార్యతో విడాకులు

బెంగళూరులోని కేఆర్ పురంలో సురేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గతంలో సురేష్ కు వివాహం అయ్యింది. సురేష్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రానురాను సురేష్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే దంపతుల మద్య రాజీకుదరలేదు. 17 సంవత్సరాల క్రితం సురేష్ అతని భార్యకు విడాకులు ఇచ్చేశాడు.

రెండో పెళ్లి చేసుకున్న కోటీశ్వరుడు

రెండో పెళ్లి చేసుకున్న కోటీశ్వరుడు

మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత 17 సంవత్సరాల క్రితం అరుణ కుమారి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్యత అరుణ కుమారితో మొదట సంతోషంగా కాపురం చేసిన సురేష్ ఓ కుమార్తెకు తండ్రి అయ్యాడు. సురేష్, అరుణ కుమారి దంపతుల కుమార్తెకు ఇప్పుడు 15 సంవత్సరాల వయసు. కూతురు, భార్య అరుణ కుమారితో కలిసి సురేష్ కేఆర్ పురంలోనే నివాసం ఉంటున్నాడు.

 భర్త పేరుతో కోట్ల రూపాయల ఆస్తి

భర్త పేరుతో కోట్ల రూపాయల ఆస్తి


రెండో పెళ్లి చేసుకున్న సురేరష్ కు అతని రెండో భార్య అరుణ కుమారి కారణంగా అనేక ఇబ్బందులు ఎదురైనాయి. భర్త సురేష్ పేరుతో కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉంది. ఆస్తి తన పేరుతో రాసివ్వాలని సురేష్ రెండో భార్య అరుణ కుమారి చాలా కాలం నుంచి పీడిస్తోంది. ఆస్తి రెండో భార్య అరుణ కుమారి పేరుతో రాసివ్వడానికి ఆమె భర్త సురేష్ నిరాకరించాడు. ఇదే విషయంలో సురేష్, అరుణ కుమారి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

ఇప్పటికే భార్య మీద మూడుసార్లు కేసు పెట్టాడు

ఇప్పటికే భార్య మీద మూడుసార్లు కేసు పెట్టాడు

సురేష్, అరుణ కుమారి దంపతుల మద్య రానురాను గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే భర్త సురేష్ ను పట్టుకుని అతని రెండో భార్య అరుణ కుమారి మూడుసార్లు చితకబాదింది. తన భార్య అరుణ కుమారి తన మీద దాడి చేస్తోందని సురేష్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫ్యామిలీ మ్యాటర్ అని పోలీసులు అరుణ కుమారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించారు.

దుప్పటిలో చుట్టేసి చేతులు, కాళ్లు విరిచేసిన భార్య

దుప్పటిలో చుట్టేసి చేతులు, కాళ్లు విరిచేసిన భార్య


భర్త సురేష్ అతని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే అతని రెండో భార్య అరుణ కుమారి ఇంటి తలుపులు మూసేసింది. ఇంట్లో భర్త సురేష్ ను పట్టుకుని చితకబాదేసింది. రెండో భార్య అరుణ కుమారి కొట్టే దెబ్బలు తట్టుకోలేక భర్త సురేష్ బెడ్ రూమ్ లోకి వెళ్లి కుమిలిపోయి తరువాత నిద్రపోయాడు. అర్దరాత్రి భార్య అరుణ కుమారి ఆమె తల్లి జయశ్రీ, కూతురు కలిసి బెడ్ రూమ్ లో ఉన్న భర్త సురేష్ కదలకుండా దుప్పటిలో చెట్టేశారు. అంతే పెద్ద ఇనుపరాడ్ తీసుకున్న భార్య అరుణ కుమారి ఆమె భర్త సురేష్ ను చితకబాదేసింది, తరువాత ముఖానికి టవల్ చుట్టేసి పెద్ద కర్రతీసుకుని అతని మీద దాడి చేసింది. భర్త సురేష్ చనిపోయాడని అనుకున్న అరుణ కుమారి ఇంటి బయట గొళ్లెం పెట్టి అక్కడి నుంచి పరారైయ్యింది.

Recommended Video

    గాంధీ భవన్ లో సాంప్రదాయబద్దంగా బతుకమ్మ వేడుకలు || Oneindia Telugu
    భర్త 25 ఎముకలు కట్..... నా భార్య నన్ను చంపేస్తుంది.. మీరే కాపాడండి

    భర్త 25 ఎముకలు కట్..... నా భార్య నన్ను చంపేస్తుంది.. మీరే కాపాడండి


    స్థానికుల సహాయంతో సురేష్ ఆసుపత్రిలో చేరాడు. భార్య అరుణ కుమారి కొట్టిన దెబ్బలకు ఆమె భర్త సురేష్ కాళ్లు, చేతులు, వెన్నుతో పాటు శరీరంలోని 25 ఎముకలు విరిగిపోయాయని వైద్యులు చెప్పారు. సురేష్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. రౌడీపెళ్లామ్ అరుణ కుమారి మీద ఆమె భర్త సురేష్ కేసు పెట్టాడు. కేఆర్ పురం పోలీసులు అరుణ కుమారి మీద హత్యాయత్నం కేసు నమోదు చెయ్యడంతో కిలాడీ భార్య పరారైయ్యింది. నా భార్య అరుణ కుమారి నన్ను చంపేస్తుందని, నేను ఇంటికి వెళ్లనని, మీరే నన్ను కాపాడాలని సురేష్ పోలీసులను వేడుకుంటున్నాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+