Khiladi: భర్త సైలెంట్, ప్రియుడు వైలెంట్, కన్నింగ్ భార్య ?, భర్త దూరంగా ఉంటే ప్రియుడు, జస్ట్ మిస్ !
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇంకా పిలలలు పుట్టలేదు. భర్త సొంత ఊర్లో నివాసం ఉంటూ వ్యవసాయం చేయిస్తున్నాడు. సిటీకి చేరుకున్న భార్య ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. అదే ఆసుపత్రిలో ఓ యువకుడి సోదరి కూడా ఉద్యోగం చేస్తోంది. సోదరి కోసం ఆసుపత్రికి వెళ్లి వస్తున్న యువకుడికి వివాహిత మహిళ పరిచయం అయ్యింది. అప్పుడప్పుడు ఆసుపత్రి బయట మాట్లాడుకుంటున్న వివాహిత మహిళ, ఆ యువకుడు తరువాత సన్నిహితంగా మెలగడం మొదలు పెట్టారు, భర్తకు దూరంగా ఉంటున్న వివాహిత మహిళ రోజు కలుస్తున్న పెళ్లికాని యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె ఇంటికే పిలిపించుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది, ఇదే సమయంలో ప్రియుడు కొత్త బైక్ కోనుగోలు చెయ్యడానికి వివాహిత మహిళ డబ్బులు ఇచ్చింది. విషయం తెలుసుకున్న భర్త అతని భార్యను మందలించాడు. నువ్వు భార్యకు దూరంగా ఉండాలని, నా భార్య దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని భర్త అతని భార్య ప్రియుడికి వార్నింగ్ ఇచ్చాడు. కొంతకాలం తరువాత సిటీలో ఉన్న భార్యను చూడటానికి భర్త వెళ్లాడు. నా భర్త ఇంటికి వస్తున్నాడని, నువ్వు ఈ రోజు మా ఇంటి వైపు రాకూడదని ప్రియురాలు ఆమె ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. ప్రియురాలి భర్త వస్తున్నాడని తెలుసుకున్న ప్రియుడు అతని స్నేహితుడిని వెంట పెట్టుకుని వెళ్లి మా జల్సాలకు నువ్వు అడ్డుపడుతున్నావా అంటూ ప్రియురాలి భర్తను కత్తితో పొడిచేయడం కలకలం రేపింది.

దంపతులకు పిల్లలు లేరు
కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగలలో నరసింహశెట్టి (34) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నరసింహశెట్టి వరలక్ష్మి (30) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నరసింహశెట్టి, వరలక్ష్మి దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. నరసింహశెట్టి, వరలక్ష్మి దంపతులకు ఇంకా పిలలలు పుట్టలేదు.

బెంగళూరులో ఒంటరిగా భార్య
నరసింహ శెట్టి నాగమంగలోనే ఉంటూ సొంత పొలంలో వ్యవసాయం చేయిస్తున్నాడు. బెంగళూరు సిటీకి చేరుకున్న నరసింహశెట్టి భార్య వరలక్ష్మి శ్రీనగర్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. శ్రీనగర్ లో నివాసం ఉంటున్న చంద్రు (32) అనే యువకుడి సోదరి కూడా వరలక్ష్మి ఉద్యోగం చేస్తున్న ఆసుపత్రిలోనే పని చేస్తోంది.

భర్తకు దూరంగా ఉంటున్న భార్యతో ?
సోదరిని మాట్లాడటం కోసం ఆసుపత్రికి వెళ్లి వస్తున్న చంద్రుకు అదే ఆసుపత్రిలో పని చేస్తున్న వివాహిత మహిళ వరలక్ష్మితో పరిచయం అయ్యింది. అప్పుడప్పుడు ఆసుపత్రి బయట మాట్లాడుకుంటున్న వివాహిత మహిళ వరలక్ష్మి, చంద్రు తరువాత రానురాను రోజు కలవడం మొదలు పెట్టి సన్నిహితంగా మెలగడం మొదలు పెట్టారు, భర్త నరసింహశెట్టికి దూరంగా ఉంటున్న వరలక్ష్మి ఆమె బాయ్ ఫ్రెండ్ చంద్రుకు దగ్గర అయ్యింది.

పెళ్లికాని ప్రియుడితో ఎంజాయ్
భర్త నరసింహశెట్టికి దూరంగా ఉంటున్న వివాహిత మహిళ వరలక్ష్మి ప్రతిరోజు కలుస్తున్న పెళ్లికాని చంద్రుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త వేరే జిల్లాలో ఉండటంతో వరలక్ష్మి ఆమె ప్రియుడు చంద్రును బెంగళూరులోని ఆమె ఇంటికే పిలిపించుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది, పెళ్లికాని చంద్రు కూడా వివాహిత మహిళతో జల్సా చేస్తున్నాడు.

ప్రియుడి కొత్త బైక్ కోసం డబ్బులు ఇచ్చిన భార్య
ఇటీవల చంద్రు కొత్త బైక్ తీసుకోవాలని, డబ్బులు అవసరంగా ఉందని అతని ప్రియురాలు వరలక్ష్మికి చెప్పాడు. ప్రియుడు చంద్రు కొత్త బైక్ కోనుగోలు చెయ్యడానికి వివాహిత మహిళ వరలక్ష్మి డబ్బులు ఇచ్చింది. తన భార్య వరలక్ష్మి చంద్రు అనే యువకుడితో క్లోజ్ గా ఉంటుందని, అతనికి డబ్బులు కూడా ఇస్తోందనే విషయం తెలుసుకున్న ఆమె భర్త నరసింహశెట్టి రగిలిపోయాడు.

భార్యకు, ప్రియుడికి వార్నింగ్
నువ్వు చంద్రుతో ఎందుకు చనువుగా ఉంటున్నావు, మర్యాదగా అతని గురించి పట్టించుకోవడం మానేయాలని భార్య వరలక్ష్మిని ఆమె భర్త నరసింహశెట్టి మందలించాడు. నువ్వు భార్య వరలక్ష్మికి దూరంగా ఉండాలని, నా భార్య దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని నరసింహశెట్టి అతని భార్య వరలక్ష్మి ప్రియుడు చంద్రుకు వార్నింగ్ ఇచ్చాడు.

ప్రియుడికి ఫోన్ చేసి భర్త వస్తున్నాడని మ్యాటర్ లీక్ చేసిన భార్య
బెంగళూరు సిటీలో ఉన్న భార్య వరలక్ష్మిని చూడటానికి ఆమె భర్త నరసింహశెట్టి వెళ్లాడు. నా భర్త నరసింహశెట్టి మండ్య నుంచి బెంగళూరులోని తన ఇంటికి వస్తున్నాడని, నువ్వు ఈ రోజు మా ఇంటి వైపు రాకూడదని వరలక్ష్మి ఆమె ప్రియుడు చంద్రుకు ఫోన్ చేసి చెప్పింది. ప్రియురాలు వరలక్ష్మి భర్త నరసింహశెట్టి బెంగళూరు వస్తున్నాడని తెలుసుకున్న ప్రియుడు చంద్రు అతని స్నేహితుడు కిరణ్ (34)ను వెంట పెట్టుకుని వరలక్ష్మి ఇంటికి వెళ్లాడు.
Recommended Video

భర్తను పొడిచిపారేసిన ప్రియుడు
మా జల్సాలకు నువ్వు అడ్డుపడుతున్నావా అంటూ చంద్రు, అతని స్నేహితుడు కిరణ్ కలిసి ప్రియురాలు వరలక్ష్మి భర్త నరసింహశెట్టిని కత్తితో పొడిచేయడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన నరసింహశెట్టిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. భార్య వరలక్ష్మి బాయ్ ఫ్రెండ్ చంద్రు, అతని స్నేహితుడు కిరణ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఇంత సీన్ జరగడానికి కారణం అయిన మేడమ్ వరలక్ష్మి మాత్రం తనకు ఏమీ తెలీదు అనే టైపులో ప్రవర్తించడంతో ఆమె భర్త నరసింహశెట్టి కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు వరలక్ష్మిని అరెస్టు చెయ్యలేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications