Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Khiladi wife: భర్త డాబాకు నిప్పు పెట్టించిన భార్య, ప్రాణం పోయింది, రౌడీషీటర్ తో డీలింగ్ !

బెంగళూరు: ఫేమస్ డాబా నిర్వహిస్తున్న యువకుడికి, మరో యువతికి మ్యాట్రీమోనీలో పరిచయం అయ్యింది. కొంతకాలం కలిసి తిరిగిన యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న నాలుగు నెలల్లోనే దంపతుల మద్య విబేధాలు వచ్చాయి. ఏదో ఒక విషయంలో దంపతులు నిత్యం గొడవపడటం మొదలు పెట్టారు. ఇక లాభం లేదని భర్త అతని భార్యను పుట్టింటికి పంపించేశాడు. పుట్టింటిలో ఉన్న భార్యను చూడటానికి ఆమె భర్త ఒక్కసారి కూడా అత్తారింటికి వెళ్లలేదు. భర్త మీద రగిలిపోయిన భార్య భర్త డాబాను బస్మం చెయ్యాలని స్కెచ్ వేసింది. రౌడీషీటర్ కు కిరాయి ఇచ్చిన భార్య ఆమె భర్త డాబాకు నిప్పంటించింది. రౌడీషీటర్, అతని అనుచరులు డాబాకు నిప్పు పెట్టే సమయంలో ఆ డాబాలో పని చేస్తున్న వ్యక్తి మీద పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు భర్త డాబాకు నిప్పంటించి ఒకరిని హత్య చేయించిన కేసులో భార్య శీతల్ భుజానికి బ్యాగ్ తగిలించుకుని పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. అయితే ఇంతకాలం తన భర్త సొంత డాబా అని బావించిన భార్య ఆ యూటర్న్ డాబాలో ఆమె భర్త పార్ట్నర్ మాత్రమే అని తెలుసుకునే సమయానికి జరగరాని నష్టం జరిగిపోయింది.

ఫేమస్ యూటర్న్ డాబా

ఫేమస్ యూటర్న్ డాబా

బెంగళూరు సిటీ శివార్లలోని సోలదేవనహళ్ళిలో యూటర్న్ అనే డాబా ఉంది. సోలదేవనహళ్ళిలోని యూటర్న్ డాబా ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. యూటర్న్ డాబాను బెంగళూరుకు చెందిన అర్పిత్, సోలదేవనహళ్లికి చెందిన మంజునాథ్, హేమంత్ అనే ముగ్గురు పార్ట్నర్స్ గా నిర్వహిస్తున్నారు. యూటర్న్ డాబాకు విపరీతంగా కస్టమర్లు వెలుతున్న సందర్బంగా అక్కడ వ్యాపారం జోరుగా సాగుతోంది.

మ్యాట్రీమోనీ లవ్ స్టోరీ..... పెళ్లి

మ్యాట్రీమోనీ లవ్ స్టోరీ..... పెళ్లి


యూటర్న్ డాబాలో భాగస్వామి అయిన అర్పిత్ కు మ్యాట్రీమోనీలో శీతల్ అనే యువతి పరిచయం అయ్యింది. అర్పిత్, శీతల్ ఒకరి గురించి ఒకరు తెలుసుకుని దగ్గర అయ్యారు. కొంతకాలం కలిసి తిరిగిన అర్పిత్, శీతల్ తరువాత పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న నాలుగు నెలు మాత్రమే హ్యాపీగా సంసారం చేసిన శీతల్, అర్పిత్ దంపతుల మద్య విబేధాలు వచ్చాయి.

భార్యను పుట్టింటికి పంపించేశాడు

భార్యను పుట్టింటికి పంపించేశాడు

ఏదో ఒక విషయంలో అర్పిత్, శీతల్ దంపతులు నిత్యం గొడవపడటం జరగడం మొదలైనాయి. చాలా కాలం ఓపికగా ఉన్న అర్పిత్ ఇక లాభం లేదని అతని భర్త శీతల్ ను ఆమె పుట్టింటికి పంపించేశాడు. పుట్టింటిలో ఉన్న భార్య శీతల్ ను చూడటానికి ఆమె భర్త అర్పిత్ చాలా నెలల పాటు ఒక్కసారి కూడా అత్తారింటికి వెళ్లలేదు.

భర్త డాబా మీద కన్ను వేసిన భార్య

భర్త డాబా మీద కన్ను వేసిన భార్య

నేను డాబాలో వ్యాపారం చేస్తూ చాలా బిజీగా ఉన్నానని, వచ్చే వారం వస్తాను, వచ్చే నెలలో వస్తాను అంటూ అర్పిత్ అతని భార్య శీతల్ కు మాయమాటలు చెబుతూ ఆమె దగ్గరకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తన భర్త అర్పిత్ తనను చూడటానికి ఒక్కసారి కూడా రాలేదని రగిలిపోయిన శీతల్ ఆమె భర్త యూటర్న్ డాబాను బస్మం చెయ్యాలని స్కెచ్ వేసింది.

రౌడీషీటర్ కు కిరాయి ఇచ్చిన భార్య

రౌడీషీటర్ కు కిరాయి ఇచ్చిన భార్య

శీతల్ కు రౌడీషీటర్ మనుకుమార్ అనే వ్యక్తి ముందు నుంచి పరిచయం ఉన్నాడు. రౌడీషీటర్ మనుకుమార్ ను కలిసిన శీతల్ తన భర్త యూటర్న్ డాబాకు నిప్పంటించాలని చెప్పి అతనికి రూ. 20 వేలు కిరాయి ఇచ్చింది. మనుకుమార్, అతని అనుచరులు గత నెల డిసెంబర్ 24వ తేదీ అర్దరాత్రి సోలదేవనహళ్ళి డాబా దగ్గరకు వెళ్లారు.

 అడ్డుకున్నాడని ఉద్యోగిని చంపేశారు

అడ్డుకున్నాడని ఉద్యోగిని చంపేశారు

రౌడీషీటర్ మనుకుమార్, అతని అనుచరులు యూటర్న్ డాబాకు నిప్పు పెట్టే సమయంలో ఆ డాబాలో పని చేస్తున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో రెచ్చిపోయిన మనుకుమార్ అతని అనుచరులు డాబా మీద, మనోజ్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారైనారు. మంట్లో కాలిపోయిన మనోజ్ కుమార్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

కింగ్ పిన్ అర్పిత్ భార్య

కింగ్ పిన్ అర్పిత్ భార్య

సోలదేవనహళ్ళి పోలీసులు అనేక కోణాల్లో యూటర్న్ డాబా కేసును విచారణ చేశారు. కేసు విచారణలో యూటర్న్ డాబా యజమానులైన అర్పిత్, మంజునాథ్, హేమంత్ ల గురించి ఆరా తీశారు. ఆ సమయంలో అర్పిత్ భార్య శీతల్ యూటర్న్ డాబాకు నిప్పంటించడానికి మనుకుమార్ అనే రౌడీషీటర్ కు కిరాయి ఇచ్చిందని వెలుగు చూడటంతో అందరూ హడలిపోయారు.

 కిలాడీ శీతల్ పరుగో పరుగు

కిలాడీ శీతల్ పరుగో పరుగు

భర్త అర్పిత్ డాబాకు నిప్పంటించి ఒకరిని హత్య చేయించిన కేసులో అతని భార్య శీతల్ భుజానికి బ్యాగ్ తగిలించుకుని పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. అయితే ఇంతకాలం తన భర్త అర్పిత్ సొంత డాబా అని బావించిన శీతల్ ఆ యూటర్న్ డాబాలో ఆమె భర్త పార్ట్నర్ మాత్రమే అని, మొత్తం ముగ్గురు యజమానులు అని తెలుసుకునే సమయానికి జరగరాని నష్టం జరిగిపోయిందని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+