Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

khiladi Wife: బెడ్ రూమ్ లో భర్తను దుప్పటితో చంపేసిన సుబ్బలక్ష్మి, మరుసటి రోజు ఫోన్ చేసి !

చెన్నై/ తుత్తుకూడి: కొన్ని సంవత్సరాల క్రితం యువతి, యువకుడు సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసిన దంపతులు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు ఇద్దరికి రాజీలు చేస్తూనే ఉన్నారు. పెద్దలు బుద్దిమాటలు చెప్పినప్పుడు సరే అంటున్న దంపతులు తరువాత సరాలు ఆడకుండా చేతికి ఏది చిక్కితే అవి పట్టుకుని ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. వీరి జీవితం ఇంతే అంటూ పెద్దలు సైలెంట్ గా వారిని వదిలేశారు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్య మీద చిందులు వేశాడు. ఇంట్లో చేసి పెట్టింది తినేసి మర్యాదగా నీ రూమ్ లోకి వెళ్లి నిద్రపోవాలని, నా రూమ్ లోకి వస్తే మర్యాదగా ఉండదని భార్య వార్నింగ్ ఇచ్చింది. తరువాత అక్కడ సినిమా చాలానే జరిగింది. అర్దరాత్రి నిద్రలేచిన భర్త అతని భార్య ఉన్న రూమ్ లోకి వెళ్లాడు. అంతే భార్యకు ఎక్కడో కాలిపోయి భర్తను దుప్పటితో చంపేసింది. మరుసటి రోజు సుబ్బలక్ష్మి చేతిలో ఆమె భర్త హత్యకు గురైనాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

 హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు

హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని తాళముత్తునగర్ లో అర్ముగం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆర్ముగం సుబ్బలక్ష్మి అనే యువతిని సంతోషంగా పెళ్లి చేసుకున్నాడు. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసిన ఆర్ముగం, సుబ్బలక్ష్మి దంపతులు ఒ కొడుకు, కూతురుకు తల్లిదండ్రులు అయ్యారు.

 చేతికి చిక్కినవాటితో కొట్టుకుంటున్న దంపతులు

చేతికి చిక్కినవాటితో కొట్టుకుంటున్న దంపతులు

పిల్లలు పుట్టిన తరువాత ఆర్ముగం, సుబ్బలక్ష్మి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు ఇద్దరికి రాజీలు చేస్తూనే ఉన్నారు. పెద్దలు బుద్దిమాటలు చెప్పినప్పుడు సరే అంటున్న అర్ముగం, సుబ్బలక్ష్మి దంపతులు తరువాత రెచ్చిపోతున్నారు. ఇంట్లో సరాలు ఆడకుండా ఆర్ముగం, సుబ్బలక్ష్మి చేతికి ఏది చిక్కితే అవి పట్టుకుని ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. వీరి జీవితం ఇంతే అంటూ పెద్దలు సైలెంట్ గా వారిని వదిలేశారు.

 మర్యాదగా తిని నిద్రపోవాలని భార్య వార్నింగ్

మర్యాదగా తిని నిద్రపోవాలని భార్య వార్నింగ్

రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన ఆర్ముగం అతని భార్య సుబ్బలక్ష్మి మీద చిందులు వేశాడు. ఇంట్లో చేసి పెట్టింది తినేసి మర్యాదగా నీ రూమ్ లోకి వెళ్లి నిద్రపోవాలని, నా రూమ్ లోకి వస్తే మర్యాదగా ఉండదని సుబ్బలక్ష్మి ఆమె భర్త ఆర్ముగంకు వార్నింగ్ ఇచ్చింది. ఆ సమయంలో ఆర్ముగం, సుబ్బలక్ష్మి పెద్దగా గొడవపడ్డారు. చుట్టుపక్కల వారు వెళ్లి రోజూ ఏమిటి మీ రామాయణం అంటూ ఇద్దరికి బుద్దిమాటలు చెప్పి వెళ్లారు.

 అర్దరాత్రి భార్య రూమ్ లోకి వెళ్లిన భర్త.... అంతే

అర్దరాత్రి భార్య రూమ్ లోకి వెళ్లిన భర్త.... అంతే

అదే రోజు అర్దరాత్రి ఆర్ముగం అతని భార్య సుబ్బలక్ష్మి నిద్రపోతున్న రూమ్ లోకి వెళ్లాడు. ఆ సమయంలో ఆర్ముగం, సుబ్బలక్ష్మి దంపతుల మద్య మళ్లీ గొడవ జరిగింది. తరువాత సహనం కోల్పోయిన సుబ్బలక్ష్మి బెడ్ మీద ఉన్న దుప్పటి తీసుకుని ఆమె భర్త ఆర్ముగం గొంతు బిగించింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆర్ముగం కిందపడిపోయాడు. ఆర్ముగంను అతని భార్య సుబ్బలక్ష్మి అలాగే వదిలేసింది.

 నా మొగుడికి ఏదో అయ్యిందని పోలీసులకు ఫోన్ చేసింది

నా మొగుడికి ఏదో అయ్యిందని పోలీసులకు ఫోన్ చేసింది

మరుసటి రోజు ఉదయం ఎంతసేపు అయినా ఆర్ముగం నిద్రలేవకపోవడంతో అతని భార్య సుబ్బలక్ష్మికి అనుమానం వచ్చింది. చూస్తే మొగుడు ఆర్ముగం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వెంటనే ఆర్ముగం మెడకు ఉన్న దుప్పటి పక్కకు లాగేసిన సుబ్బలక్ష్మి నా మొగుడు పీకలదాక మద్యం సేవించి నిద్రపోయి తరువాత నిద్రలేవలేదని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు పరిశీలించగా ఆర్ముగం ప్రాణాలు గాలిలో కలిసిపోయాకని గుర్తించారు.

 సుబ్బలక్ష్మి అరెస్టు

సుబ్బలక్ష్మి అరెస్టు

సుబ్బలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా ఆమె రాత్రి జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది. భర్త ఆర్ముగంను దుప్పటితో గొంతు బిగించి చంపేసిన అతని భార్య సుబ్బలక్ష్మిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మద్యం సేవించినందుకే సుబ్బలక్ష్మి అతన్ని చంపేసిందా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అంటూ ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+