తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన ఖుష్బూ

Khushboo
చెన్నై‌‌: ప్రముఖ నటి ఖుష్బూ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సోమవారం చెన్నైలోని తన నివాసం నుంచి సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరతుండగా ఈ సంఘటన జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కారును ఆమె ఆపేశారు.

అయితే, వెనకనే వస్తున్న నగర రవాణా విభాగం బస్సు ఖుష్బూ కారును బలంగా ఢీకొట్టింది. కారు వెనక భాగం చాలా వరకు ధ్వంసమైంది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ఖుష్బూకు ఏ విధమైన ప్రమాదమూ జరగలేదు.

ఆ ప్రమాదంపై ఖుష్బు తన ట్విట్టర్‌లో వివరించారు. కారు ప్రమాదంలో తనకు ఏ విధమైన ప్రమాదం జరగలేదని, ముందు వెళ్లే వాహనాలను గమనించకుండా నిర్లక్ష్యంగా బస్సును నడిపిన డ్రైవర్‌పై చాలా కోపం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.

డ్రైవర్ బాధ్యతారాహిత్యం వల్లనే తన కారు ధ్వంసం కావడంతో పాటు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అతనిపై ఫిర్యాదు చేస్తే వాళ్ల సంఘం కాపాడే ప్రయత్నం చేయవచ్చునని, ఆ డ్రైవర్ కూడా తన కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడుతారని బతిమిలాడవచ్చునని, ఇవన్నీ ఆలోచించి ఫిర్యాదు చేయలేదని ఆమె వివరించారు.

ఆ కారును తన భర్త తనకు బహుమతిగా ఇచ్చారని, అలాంటి కారు ధ్వంసం కావడం బాధగా ఉందని ఖుష్బూ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+