"కిడ్నీ టచింగ్ పర్మామెన్స్.." ? 'సిస్టర్ స్ట్రోక్' మామూలుగా లేదుగా..!

బిహార్ లో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య.. తాజాగా సంచలన ప్రకటన చేశారు. తన కుటుంబంతో సంబంధాలను తెంచుకుని, రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజయ్ యాదవ్‌, రమీజ్ ఆలం ఇచ్చిన సూచనల మేరకు తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. అయితే రోహిణి ఆచార్య తాజా నిర్ణయంపై బిహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైశ్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఆయన కూతురు రోహిణి ఆచార్య చేసిన సంచలన ఆరోపణలపై బిహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైశ్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆర్జేడీ వారసత్వం ఇందులో కలగజేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. " లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆయన కూతురు రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేసి ఆయన ప్రాణాలు కాపాడారు. కానీ పార్టీలో ఆమెను అగౌరవ పరిచి.. బలవంతంగా ఇంటి నుంచే గెంటేయడం చాలా బాధాకరం. లాలూ ప్రసాద్, రబ్రీ దేవి ఇద్దరూ ఈ వివాదంలో కలుగజేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. ఒకవేళ ఫ్యామిలీ గొడవల్లో బయటి వ్యక్తులు దూరి కుటుంబ సభ్యులనే అగౌరవ పరుస్తుంటే.. దీన్ని కచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది వారి సొంత కుటుంబ కలహాలు అయినా ఇప్పటికే సోషల్ మీడియాలో, టీవీల్లో ప్రచారం అయింది" అని బిహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైశ్వాల్ స్పష్టం చేశారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య.. నవంబర్ 15 న ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. తన సోదరుడు తేజస్వి యాదవ్‌ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్ సూచన మేరకు తాను రాజకీయాలను విడిచిపెడుతున్నట్లు, తన కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అన్ని నిందలకు తానే బాధ్యత తీసుకుంటున్నట్టుగా తెలిపారు. అంతేకాక మరో పోస్టులో.. తన కుటుంబ సభ్యులు తనను అవమానించారని, బెదిరించారని, అంతేకాక చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తనకు ఇక నుంచి కుటుంబం లేదని.. బిహార్ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి గల కారణాలను తేజస్వీ యాదవ్, అతని సన్నిహితుడు సంజయ్ యాదవ్‌ లే చెప్పాలన్నారు. ఆమె పోస్టు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర ఓటమి తర్వాత రోహిణి ఆచార్య ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇక రోహిణి ఆచార్య ఓ డాక్టర్.. ఆమె తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు 2022 లో కిడ్నీ దానం చేసి ఆయన ప్రాణాలను కాపాడారు. ఇటీవలి బిహార్ ఎన్నికల్లో సోదరుడు తేజస్వి యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

Kidney Sacrifice to Family Betrayal Rohini Acharya s Heartbreaking Exit amp amp BJP s Dilip Jaiswal Slams Lalu Family Rift

ఈ క్రమంలో ఆర్జేడీ పార్టీలో వరుస షాకింగ్ న్యూస్ లు పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సిస్టర్ స్ట్రోక్.. ఇప్పుడు బిహార్ కూ పాకిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+