పిల్లల కోసం సేఫ్ సెర్చింజన్ కిడి
ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఏది కావాలన్న ఒక్క క్లిక్‌లోనే దొరుకుతోంది. నాణేనికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే టెక్నాలజీకి కూడా మంచీ చెడూ పార్శ్వాలున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్‌తో ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోతే పిల్లలు పోర్నోగ్రఫీ, హింస, డ్రగ్స్ వాడకం తదితర అంశాల గురించి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు మేమున్నామంటోంది కిడీ డాట్ కో.
కిడీ డాట్ కో
గూగుల్ తరహాలోనే కిడీ కూడా ఒక సెర్చింజన్. అయితే గూగుల్‌లా కాకుండా ఇది ప్రత్యేకించి పిల్లల కోసం తయారుచేసిన సెర్చింజన్. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే కిడీ, పిల్లలకు సంబంధించిన అంశాలు, ఆటలు, సృనాత్మకతను పెంచే కంటెంట్ ను మాత్రమే అందుబాటులో ఉంచుతుంది. పిల్లలపై దుష్ప్రభావం చూపే ఎలాంటి సమాచారం కూడా ఇందులో కనిపించదు.

అడల్ట్ కంటెంట్‌కు నో ఛాన్స్
ప్రత్యేకించి పిల్లల కోసమే రూపొందించిన కిడీ డాట్ కో లో అడల్ట్ కంటెంట్‌కు స్థానం లేదు. గూగుల్ సెర్చింజన్‌లోని అంశాలను కూడా ఫిల్టర్ చేసిన తర్వాతనే కిడీ రిజల్ట్ చూపిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, కీ వర్డ్‌ల ఆధారంగా సెక్స్, పోర్న్, డ్రగ్స్, హింసకు సంబంధించిన సైట్లను, అంశాలను ఇది బ్లాక్ చేస్తుంది. దీంతో పిల్లలు అలాంటి కంటెంట్ చూసే అవకాశం ఉండదు.












Click it and Unblock the Notifications