Killer: ప్రియుడితో భార్య ?, 19 ఏళ్ల తరువాత భార్య మీద డౌట్, ఫ్యామిలీలో నలుగురిని చంపేసి ?, బస్సులో !
అహమ్మదాబాద్/ఇండోర్: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వివాహం జరిగిన 19 సంవత్సరాల తరువాత భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే సమయంలో ఆంటీతో ఓ యువకుడు చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. ఆంటీ కూడా ఆ యువకుడితో సంతోషంగా గడపడం మొదలుపెట్టింది. తన భార్యను కంట్రోల్ లో పెట్టాలని భార్య అమ్మమ్మను చెప్పి ఆమెను ఇంట్లో కాపలా పెట్టాడు.అయితే ఆంటీ అక్రమ సంబంధానికి ఆమె అమ్మమ్మ కూడా వత్తాసు పలుకుతోందని తెలుసుకున్న భర్త రగిలిపోయాడు.
తన భార్యను కంట్రోల్ లో పెట్టకపోతే నిన్ను చంపేస్తానని భర్త అతని భార్య అమ్మమ్మకు వార్నింగ్ ఇచ్చాడు. ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా తన భార్య, ఆమె అమ్మమ్మ పద్దతి మార్చుకోలేదని అతను ఆవేశంతో ఊగిపోయాడు. రాత్రి పక్కాప్లాన్ తో భార్యను, అమ్మమ్మను చంపేశాడు .ఆ సమయంలో కొడుకు, కూతురు అడ్డుపడటంతో వాళ్లను కూడా చంపేశాడు. ఫ్యామిలీలోని నలుగురిని దారుణంగా చంపేసిన అతను హ్యాపీగా నగరాలు తిరుగుతూ కాలం గడపడానికి ప్రయత్నించాడు.

19 ఏళ్ల క్రితం పెళ్లి
గుజరాత్ లోని అహమ్మదాబాద్ సిటీలోని ఓధవ్ ప్రాంతంలో వినోద్ గైక్వాడ్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 19 సంవత్సరాల క్రితం సోనాల్ గైక్వాడ్ (38) అనే మహిళను వివాహం చేసుకోవాలని వినోద్ గైక్వాడ్ కు అతని కుటుంబ సభ్యులు చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి వినోద్ గైక్వాడ్, సోనాల్ గైక్వాడ్ గ్నీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పట్లో ఇద్దరి పెళ్లి జరిపించారు.

కొడుకు, కూతురితో హ్యాపీ
కుటుంబ సభ్యులు చూపించిన సోనాల్ గైక్వాడ్ ను వివాహం చేసుకున్న వినోద్ గైక్వాడ్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. వినోద్ గైక్వాడ్, సోనాల్ దంపతులకు గణేష్ (17) అనే కొడుకు, ప్రగతి (15) అనే కూతురు ఉన్నారు. గణేష్ కాలేజ్ లో, పవిత్రా 9వ తరగతి చదువుతున్నారు. కొడుకు, కూతురితో కలిసి వినోద్, సోనాల్ గైక్వాడ్ దంపతులు కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా జీవించారు.

ఆంటీతో క్లోజ్ గా ఉంటున్న యువకుడు
వివాహం జరిగిన 18 సంవత్సరాల తరువాత భార్య సోనాల్ గైక్వాడ్ మీద ఆమె భర్త వినోద్ గైక్వాడ్ కు అనుమానం మొదలైయ్యింది. ఇదే సమయంలో సోనాల్ ఆంటీతో ఓ యువకుడు చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. సోనాల్ ఆంటీ కూడా ఆ యువకుడితో సంతోషంగా గడపడం మొదలుపెట్టిందని ఆమె భర్త వినోద్ గైక్వాడ్ కు తెలిసిపోయింది.

భార్యకు కాపలా పెట్టిన భర్త
తన భార్య సోనాల్ ను కంట్రోల్ లో పెట్టాలని భార్య అమ్మమ్మ సుభద్రా బెన్ (70)కు చెప్పిన వినోద్ గైక్వాడ్ ఆమెను ఇంట్లో కాపలా పెట్టాడు. అయితే తన భార్య సోనాల్ అక్రమ సంబంధానికి ఆమె అమ్మమ్మ సుభద్రా బెన్ కూడా వత్తాసు పలుకుతోందని తెలుసుకున్న వినోద్ గైక్వాడ్ రగిలిపోయాడు. తన భార్య సోనాల్ ను కంట్రోల్ లో పెట్టకపోతే నిన్ను చంపేస్తానని వినోద్ అతని భార్య సోనాల్ అమ్మమ్మ సుభద్రా బెన్ కు వార్నింగ్ ఇచ్చాడు.

భార్య, కొడుకు, కూతురు, బామ్మను చంపేశాడు
ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా తన భార్య సోనాల్, ఆమె అమ్మమ్మ సుభద్రా బెన్ పద్దతి మార్చుకోలేదని వినోద్ గైక్వాడ్ ఆవేశంతో ఊగిపోయాడు. రాత్రి పక్కాప్లాన్ తో భార్య సోనాల్ గైక్వాడ్ ను, ఆమె అమ్మమ్మ సుభద్రా బెన్ ను దారుణంగా చంపేశాడు .ఆ సమయంలో కొడుకు గణేష్ (17), కూతురు ప్రగతి (15) అడ్డుపడటంతో వాళ్లను కూడా చంపేశాడు. ఫ్యామిలీలోని నలుగురిని దారుణంగా చంపేసిన వినోద్ గైక్వాడ్ అక్కడి నుంచి తప్పించుకుని మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు పారిపోయాడు.

ఆర్ టీసీ బస్సులో చిక్కిపోయాడు
ఇండోర్ నుంచి గుజరాత్ లోని దోహాద్ జిల్లాకు గుజరాత్ ఆర్ టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వినోద్ ను అదుపులోకి తీసుకున్నామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబంలోని నలుగురిని హత్య చేసిన వినోద్ ను కోర్టు ముందు హాజరుపరిచి కేసు విచారణ చేస్తున్నామని అహమ్మదాబాద్ పోలీసు అధికారులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications