Killer: వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ, లేపేసిన లిక్కర్ బాబు, నేను ఎవరో తెలుసా ? హైవేలో స్కెచ్, భార్య !

చెన్నై/ మదురై/ బెంగళూరు: మద్యం, డ్రగ్స్ సేవించి వాహనాలు నడుపుతున్న మత్తులోని బాబులు, మందు బాబులకు విధుల్లో ఉన్న సబ్ ఇన్స్ పెక్టర్ (SI) వార్నింగ్ ఇచ్చాడు. మత్తు నషాలానికి ఎక్కిన వ్యక్తి అర్దరాత్రి వాహనం నడుపుతున్న సమయంలో అతన్ని పట్టుకున్న ఎస్ఐ వార్నింగ్ ఇచ్చి అతని వాహనం లాక్కొన్నాడు. అంతే వాడికి కోపం ఎక్కడి నుంచి ఎక్కడికో ఎక్కిందో తెలీదు. నేను ఎవరో తెలుసా ?, నా వాహనం లాక్కొంటావా ? నీ అంతు చూస్తారా ? అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన మందుబాబు ఆ ఎస్ఐని అదే రోజు అర్దరాత్రి దారుణంగా చంపేశాడు. అన్నా ఎస్ఐని లేపేశాను అంటూ ఎవడికో ఫోన్ చేసిన కిరాతకుడు మాయం అయిపోయాడు. ఈ దెబ్బతో ఎస్ఐ భార్య, కేటుగాడి భార్య పరిస్థితి దారుణంగా తయారైయ్యింది.

 అర్దరాత్రి తాగి తందనాలు

అర్దరాత్రి తాగి తందనాలు

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలో అర్దరాత్రి వరకు మందు బాబులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, కొందరు మాదకద్రవ్యాలు సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. తుత్తుకూడి జిల్లాలోని జాతీయ రహదారుల్లో పోలీసలు పెట్రోలింగ్ వాహనాల్లో సంచరిస్తూ గస్తీ ముమ్మరం చేశారు.

డ్యూటీలో ఎస్ఐ బాలు

డ్యూటీలో ఎస్ఐ బాలు

తుత్తుకూడిలోని శ్రీవైకుత్తం సమీపంలోని ఎర్ల్ పోలీస్ స్టేషన్ లో బాలు సబ్ ఇన్స్ పెక్టర్ (SI)గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి (నిన్న) తుత్తుకూడిలోని జాతీయ రహదారిలో ఎవరైనా మద్యం సేవించి, మాదకద్రవ్యాలు సేవించి ఎవరైనా వాహనాలు నడుపుతున్నారా ? అంటూ ఎస్ఐ బాలుతో పాటు స్థానిక పోలీసులు అన్ని వాహనాలను పరిశీలించారు.

పొటుగాడు ఎస్కేప్

పొటుగాడు ఎస్కేప్

మురగవేల్ అనే వ్యక్తి పీకలదాక మద్యం సేవించి, డ్రగ్స్ సేవించి అటువైపు వాహనం నడుపుకుంటూ జోరుగా వెళ్లాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ బాలు మురగవేల్ వాహనం అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఎస్ఐ బాలు నుంచి తప్పించుకున్న మురగవేల్ అతని వాహనంలో అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు.

నేను ఎవరో తెలుసా ? నీ అంతు చూస్తా

నేను ఎవరో తెలుసా ? నీ అంతు చూస్తా

ఎస్ఐ బాలు మురగవల్ వాహనం వెంబడించి అతన్ని పట్టుకున్నాడు. మద్యం సేవించి వాహనం నడపడం తప్పు అంటూ అతన్ని వాహనం లాక్కొన్నాడు. ఆ సమయంలో ఎస్ఐ బాలు, మందుబాబు మురగవేల్ మద్య మాటామాటా పెరిగింది. నేను ఎవరనుకున్నావ్, నా వాహనం లాక్కొంటావా ?, నీ అంతు చూస్తా అంటూ మురగవేల్ రెచ్చిపోయాడు. నువ్వు ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చి మాట్లాడు అంటూ ఎస్ఐ బాలు మందుబాబు మురగవేల్ కు సూచించాడు.

వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐని లేపేశాడు

వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐని లేపేశాడు

తన వాహనం లాక్కొన్నాడని రగిలిపోయిన మురగవేల్ అక్కడి నుంచి వెళ్లిపోయి గంట తరువాత వేరే ట్రక్ తీసుకువచ్చి రోడ్డు పక్కన విధుల్లో ఉన్న ఎస్ఐ బాలు మీద ఆ వాహనం ఎక్కించి దారుణంగా చంపేసి అక్కడి నుంచి పరారైనాడు. మందుబాబు కోపంలో ట్రక్ తో ఎస్ఐ బాలును తొక్కించి చంపేయడంతో సాటి పోలీసులు హడలిపోయారు. ఎస్ఐ బాలు దారుణ హత్యకు గురి కావడంతో ఆయన భార్య ఆర్తనాదాలు చేస్తోంది. మురగవేల్ ను పట్టుకోవడానికి పోలీసు అధికారులు 10 ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

Recommended Video

    ఓవైసీ vs బిపిన్ రావత్: పెహ్లూఖాన్‌ను చంపిన వారిని ఎవరు మారుస్తారు..?
    రౌడీలు VS పోలీసులు

    రౌడీలు VS పోలీసులు

    తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలో ఇటీవల కాలంలో పోలీసులు, రౌడీల మద్య వివాదాలు చాలా ఎక్కువ అయిపోయాయి. గత ఏడాది ఆగస్టు నెలలో తుత్తుకూడి సమీపంలోని మురప్పనాడు సమీపంలోని మనక్కరై ప్రాంతంలో జంట హత్యలు జరిగాయి. జంట హత్యలు కేసులో నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసు సుబ్రమణియన్ మీద గ్రానెట్లు విసిరి దారుణంగా చంపేశారు. తుత్తుకూడిలో పదేపదే పోలీసులు, రౌడీల మద్య వివాదం ముదిరిపాకాన పడుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+