ప్రియుడి కోసం భర్తను చంపి, ముక్కలు చేసి అడవిలో పారేసిన భార్య!

భార్యలు భర్తలను దారుణంగా హతమారుస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలతో, ప్రియుడి కోసం భార్యలు భర్తలను హతమారుస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగిన భయంకరమైన హత్య కేసు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భార్య ఆమె ప్రియుడు కలిసి భర్తను హత మార్చి మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పారేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

భర్త ఉండగా భార్య వివాహేతర సంబంధం

గత ఏడాది ఆగస్ట్ లో అంటే దాదాపు 11 నెలల తర్వాత భార్య, ప్రియుడితో కలిసి చేసిన ఘాతుకం బయటపడింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం బాధితుడు బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహా ఐరోలి యాదవ్ నగర్‌లో భార్య సునీతా కుష్వాహాతో కలిసి నివసిస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సునీతా ఆటో డ్రైవర్ రాహుల్ దశరథ్ ప్రజాపతి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

killer wife wife killed husband in navi mumbai for lover came to light after a year it is a shocking crime

భర్తను ప్రియుడితో కలిసి చంపి, ముక్కలుగా నరికిన భార్య

భర్త బలిరామ్ ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో, ఇద్దరూ కలిసి అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు .2025 ఆగస్టు 9వ తేదీ రాత్రి పిల్లలను మేనత్త ఇంటికి పంపించి, బలిరామ్ నిద్రపోయిన తర్వాత ఇద్దరు కలిసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత పదునైన ఆయుధాలతో మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసి, తలను వేరు చేశారు.

ప్రియుడితో సెటిల్ అయిపోయిన భార్య

నేర ఆధారాలు దొరక్కుండా ఉండడం కోసం డెడ్ బాడీ ముక్కలు చేసిన శరీర భాగాలను సంచులు, బెడ్‌షీట్లలో చుట్టి రాహుల్ ఆటోలో తీసుకెళ్లి, నవీ ముంబై శివార్లలోని గవ్లీదేవ్ కొండల అడవిలో వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. హత్య అనంతరం సునీతా తన పిల్లలతో ఘన్సోలీకి మారి, రాహుల్‌తో కలిసి జీవితం కొనసాగించింది. బలిరామ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని బంధువులు, పొరుగువారిని నమ్మించి దాదాపు 11నెలల పాటు నేరాన్ని గోప్యంగా ఉంచారు.

అనుమానంతో మిస్సింగ్ కేసు పెట్టిన మరిది.. నిందితుల అరెస్ట్

ఏప్రిల్ 2026లో బలిరామ్ సోదరుడు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్ రికార్డులు, మొబైల్ డీటెయిల్స్, నంబర్ల మార్పులు వంటి ఆధారాల ఆధారంగా సునీతా, రాహుల్‌లను రబాలే ఎంఐడీసీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. ప్రస్తుతం కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీకి ఆదేశించింది.

అటవీ ప్రాంతంలో అస్థిపంజరం కోసం గాలింపు

పోలీసులు గవ్లీదేవ్ అడవిలో మిగిలిన అస్థిపంజరం, ఇతర ఆధారాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ కేసు మరింత దర్యాప్తు జరుగుతోంది. ఏది ఏమైనా భార్యలు భర్తలను అత్యంత అత్యంత దారుణంగా హతమారుస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+