వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ బేడీ లెఫ్టినెంట్ గవర్నర్: కాంగ్రెస్ కు చెక్

|
Google Oneindia TeluguNews

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో అధికార పగ్గాలు చేపట్టామని ఆనందంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద పిడుగు పడింది. నీతి, నిజాయితీకి మారు పేరుగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించారు. రాష్ట్రపతి అందుకు ఆమోదం తెలిపారు.

ఈ దెబ్బతో పుదుచ్చేరిలో అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు కసరత్తులు మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ? అని ఇంకా తేలాల్సి ఉంది.

ఈ పరిస్థితిలో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వానికి అధికారాలు కరువైనట్లే అన్న ప్రశ్న షికార్లు కొడుతుంది. అందుకు కారణం మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ పుదుచ్చేరికి పూర్తి స్థాయి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులు కావడమే. ఆమె విధి నిర్వహణలో కచ్చితంగా ఉంటారని అందరికి తెలిసిన విషయమే.

Kiran Bedi appointed Lieutenant Governor of Puducherry

పుదుచ్చేరిలో ప్రభుత్వం ఉన్నా అక్కడ అనుమతులు తీసుకోవాలన్నా, సంతకాల అనుమతుల కోసం గవర్నర్ ఎదుట నిలబడాల్సిందే. ఈ కారణంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ను ఇరాకటంలో పెట్టడానికి వ్యూహాత్మకంగా కిరణ్ బేడిని రంగంలో దింపారని పలువురు అంటున్నారు.

నిజాయితీగా ఉన్న కిరణ్ బేడి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉంటే కాంగ్రెస్ పప్పులు ఉడకవని బీజేపీ నాయకులు అంటున్నారు. అందుకే ఆమెను అక్కడకు పంపిస్తున్నారని సమాచారం. ఈ విషయంపై కిరణ్ బేడీ స్పందిస్తూ తాను విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటానని ప్రజా సేవకు తాను అంకితం అని సున్నితంగా సమాధానం ఇచ్చారు.

English summary
The post has been lying vacant after the Narendra Modi government sacked UPA nominee Virendra Kataria on July 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X