కేజ్రీవాల్‌కు చేయి: నరేంద్ర మోడీకే కిరణ్ బేడీ ఓటు

తనకు ప్రథమ ప్రాధాన్యం భారత్ అని, మంచి పాలన, మంచి యంత్రాంగం, నిజాయితీ, భాగస్వామ్య విధానం కారణంగా ఓ స్వతంత్ర ఓటరుగా తాను నరేంద్ర మోడీకి ఓటేస్తానని ఆమె ట్విట్టర్‌లో రాశారు. అన్నా హజారే, కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకున్న కిరణ్ బేడీ ఇప్పుడు మోడీకి మద్దతు తెలుపుతున్నారు.
కుంభకోణాలను అంతం పలకాలని భావించే ఎవరు కూడా మరోసారి కాంగ్రెసు పార్టీకి ఓటేయరని ఆమె అన్నారు. భారత్‌కు స్థిరత్వం, అనుభవం గలవారు అవసరమని ఆమె అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆయన జట్టును దేవుడు రక్షించాలని ఆమె అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో విలువలను మార్చిందని, ఇది దేశానికంతటికీ మంచిదని కిరణ్ బేడీ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కేజ్రీవాల్ కిరణ్ బేడీని ఆహ్వానించారు. అయితే ఆమె హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications