ముంబైలో తెలంగాణ భవన్: కిషన్ రెడ్డి, మనోళ్ల ప్రచారం
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలుగు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, ముంబైలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాదులోని అంబరుపేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి శనివారం అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముంబైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అనుసరించాల్సిన విధానాల పైన ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా.. సీనియర్ నేతలు, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో సమావేశమయ్యారు.

ఎన్సీపీతో కలవం: బీజేపీ
మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్సీపీతో జట్టుకట్టడం అసాధ్యమని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వేరుగా అన్నారు. ఎవరినైతే దొంగలని మేం వేలెత్తి చూపుతున్నామో అలాంటివారితో ఎలా కలుస్తామని శనివారం ఆయన వారణాసిలో విలేకరులతో అన్నారు.
కాగా, మహారాష్ట్రలో ప్రధాన పోటీ శివసేన, బీజేపీల మధ్యే ఉంటుందనీ, శివసేనకు స్వల్ప ఆధిక్యం ఉందని తేలింది. కాగా బీజేపీ వల్లే పొత్తు భగ్నమైందని, సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సరైన నేత అని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.
ఏబీపీన్యూస్ - నీల్సన్ నిర్వహించిన పోల్‌లో ఈ విషయం తేలింది. బీజేపీయే శివసేనతో తెగదెంపులు చేసుకున్నదని ముంబైలో 40శాతం అభిప్రాయపడగా శివసేనకే ఎక్కువ బాధ్యత ఉందని 27శాతం తెలిపారు. రాష్ట్ర ప్రజ ల్లో 38శాతం శివసేనను, 34శాతం బీజేపీని, 16 శాతం కాంగ్రెస్‌ను, 5శాతం ఎంఎన్‌ఎస్‌ను సమర్థిస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది.












Click it and Unblock the Notifications