తిరుమల లడ్డు, నెయ్యి సరఫరాకు చర్చలకు పిలవాలని టీటీడీకి మనవి చేసిన కేఎంఎఫ్!
తిరుమల/ బెంగళూరు: ఆగస్టు 03: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి ఏవీ. ధర్మారెడ్డికి కర్ణాటక పాల మహామండలి సమైఖ్య (కేఎంఎఫ్) లేఖ రాసింది. తిరుపతి లడ్డూలకు నందిని నెయ్యి సరఫరాపై చర్చకు మమ్మల్ని ఆహ్వానించాలని టీటీడీకి కేఎంఎఫ్ మనవి చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూలకు నెయ్యి సరఫరాను అధికార కాంగ్రెస్ పార్టీ నిలిపివేసిందని బీజేపీ విమర్శించింది.
తర్వాత టీటీడీకి నందిని నెయ్యి సరఫరా చేసే విషయంలో కేఎంఎఫ్ చర్చలకు సిద్దం కావడంతో ఈ వ్యవహారం మలుపుతిరుగుతోంది. పోటీ ధరల కారణంగా టీటీడీకి నందిని నెయ్యి సరఫరా చేయలేకపోయిందని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ అన్నారు. నందిని నెయ్యి నాణ్యమైనది. టీటీడీ ఇతర సంస్థల నెయ్యి వినియోగానికి ప్రాధాన్యత ఇస్తే లడ్డూల నాణ్యత అంతగా ఉండదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తిరుమల లడ్డూలు తయారు చెయ్యడానికి ఉపయోగించే నెయ్యి సరఫరాకు టీటీడీ టెండర్లను ఆహ్వానించింది. తక్కువ ధరకు టెండర్ వేసిన సంస్థతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. నందిని నెయ్యి ధరలు అధికంగా ఉడటం టీటీడీ ఒప్పందాన్ని రద్దు చేసింది. నందిని నెయ్యి ఉత్పత్తి వ్యయాన్ని రికవరీ చేయడం కష్టం. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని టీటీడీకి రాసిన లేఖలో కేఎంఎఫ్ పేర్కొంది.
ఇటీవలి టెండర్లలో మరింత పోటీ బిడ్డింగ్ జరిగిందని. కంపెనీలు తక్కువ ధరకే నెయ్యి అందిస్తున్నాయని, ధరల విషయంలో టీటీడీకి, కేఎంఎఫ్ ల మద్య గ్యాప్ రావడానికి ఇదే కారణం అయ్యిందని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ అంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీకి కేఎంఎఫ్ నందిని నెయ్యి సరఫరా చేయలేకపోయిందని కేఎంఎఫ్ పేర్కొంది.
కేఎంఎఫ్ సహకార రైతు సంస్థ కాబట్టి నెయ్యి ఉత్పత్తి ఖర్చులను తిరిగి పొందడం కష్టం. టెండర్లు పోటీ బిడ్డింగ్‌కు వెళ్లలేవు. మా రేట్లు ఎక్కువగా ఉన్నాయని కేఎంఎఫ్ టీటీడీకి రాసిన లేఖలో వివరించింది. చర్చల సమావేశం తేదీ, సమయాన్ని మీరు సూచించాలని ని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాయని, ఈ చర్చలో నందిని నెయ్యి రేట్లు, సరఫరా ఖర్చులపై పరస్పర అంగీకారానికి రావడానికి అవకాశం ఉందని కేఎంఎఫ్ టీటీడీకి మనవి చేస్తూ లేఖ రాసింది.
తిరుపతి లడ్డూ తయారీకి నందిని నెయ్యి సరఫరాను కేఎంఎఫ్ నిలిపివేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నందిని నెయ్యి సరఫరా చేసేందుకు టీటీడీ అనుమతి ఇవ్వలేదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ ఆరోపిస్తున్నారని గుర్తు చేశారు.
కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ ప్రకటన సరైనది కాదని, ఇ-టెండర్ అయినందున భారతదేశం అంతటా అర్హులైన నెయ్యి సరఫరాదారులను టీటీడీ టెండర్లకు ఆహ్వానించిందని, టీటీడీ ఈ-టెండర్ ప్రక్రియ ద్వారా నెయ్యితో సహా అన్ని అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తుందని, అతి తక్కువ ధర సరఫరాదారులతో టీటీడీ ఒప్పందం చేసుకుంటుదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నానని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు.












Click it and Unblock the Notifications