హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Google Search: అమ్మాయిలు ఎక్కువగా ఏమి సెర్చ్ చేస్తున్నారో మీకు తెలుసా..? షాకింగ్ రిపోర్ట్ ఇదే..!

|
Google Oneindia TeluguNews

Google Search: సాధారణంగా మనకు ఏమి అవసరమైనా ముందుగా అడిగేది గూగుల్ తల్లినే. అలాంటిది అమ్మాయిలు ఏవి సెర్చ్ చేస్తుంటారు అనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. దీనిపై తాజాగా గూగుల్ ఇటీవలే ఒక సర్వేను నిర్వహించింది. ఇందులో మహిళలు వేటిని వెతుకున్నారనే విషయాలు మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

 మహిళా యూజర్లు..

మహిళా యూజర్లు..

ప్రస్తుతం గూగుల్ కు దేశంలో 15 కోట్ల మంది యూజర్లు ఉండగా.. అందులో దాదాపు 6 కోట్ల మంది మహిళలే ఉండటం గమనార్హం. మహిళలు సైతం సాంకేతికత వినియోగంలో ముందంజలో ఉన్నారని చెప్పుకోవటాని ఇదే రుజువు అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇంటర్నెట్ యూజర్లలో ఎక్కువ మంది 15 నుంచి 35 ఏళ్ల మధ్య వారే ఎక్కువ మంది ఉన్నట్లు తేలింది.

 అమ్మాయిలు వెతికేవి ఇవే..

అమ్మాయిలు వెతికేవి ఇవే..


మహిళలు గూగుల్ లో ఎక్కువగా వెతికేది మెుదటిగా సౌందర్యానికి సంబంధించిన వాటి గురించేనట. వీటిలో ముందు స్థానంలో నిలిచింది మాత్రం గోరింటాకు. అవును మెహందీతో వివిధ డిజైన్ల కోసం అమ్మమాయిలు గూగుల్ సహాయం కోరుతున్నారట. వీటి తరువాతి స్థానంలో నిలిచింది ఆన్ లైన్ షాపింగ్. మార్కెట్లో ఎప్పటికప్పుడు వస్తున్న ట్రెండ్లకు అనుగుణంగా బట్టలు, యాక్సిసరీస్, కొత్త కలెక్షన్స్, డిస్కౌంట్ల గురించి వారు వెతుకున్నట్లు గూగుల్ నివేదిక వెల్లడించింది.

రొమాంటిక్ పాటలు..

రొమాంటిక్ పాటలు..


ఇక బ్యూటీ టిప్స్ కోసం అధికంగా గూగుల్ వాడుతున్న అమ్మాయిలకు రొమాంటిక్ పాటలంటే ఎంతో ఇష్టమని తాజా నివేదికతో తేలింది. వీటికి తోడు వాళ్లు రొమాంటిక్ కవితలు, కెరీర్ కు సంబంధించి, ఉద్యోగాలు, వివిధ వృత్తిపరమైన కోర్సులు వంటి వాటి వివరాల కోసం ఇంటర్నెట్లో ఎక్కువగా వెతుకున్నట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది.

English summary
know what girls are most likely to searching on google
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X