షాక్: 18 ఏళ్ల అమ్మాయిని తల్లిని చేసిన 12 ఏళ్ల బాలుడు

కొచ్చి: 18 ఏళ్ల అమ్మాయి తల్లి అయ్యిందని తెలుసుకున్న పోలీసులు అందుకు కారణం అయిన 12 ఏళ్ల అబ్బాయిని అరెస్టు చెయ్యడంతో కేరళ రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

అసలు 12 ఏళ్ల బాలుడు ఆ పని ఎలా చెయ్యగలడా? అని ప్రజలు వాపోతున్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి తల్లీ బిడ్డల్ని కొచ్చిలోని ప్రభుత్వ సంరక్షణా కేంద్రానికి తరలించారు.

కేరళలోని ఎర్నాకుళం జిల్లా కొచ్చి నగరం శివార్లలోని మున్సిపాలిటీ కలమసెరిలో 18 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఆమె పెళ్లి కాకుండా తల్లి అయ్యింది. పురుటినొప్పులతో బాధపడుతూ ఆ అమ్మాయి నవంబర్ 2వ తేదీన కలమసెరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది.

చూడటానికి మైనర్ లా ఉన్న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయ్యాలా ? వద్దా ? అనే సందిగ్ధంలో ఉన్న అక్కడి వైద్యులు వెంటనే చైల్డ్ లైన్ ( పిల్లల సంరక్షణా) కేంద్రానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో చైల్డ్ లైన్ ప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు.

తరువాత చైల్డ్ లైన్ ప్రతినిధులతో సంప్రధించిన వైద్యలు వెంటనే అమ్మాయికి ఆపరేషన్ చేసి పాపను బయటకు తీశారు. తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో ఈనెల 4వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. అప్పటికే అమ్మాయి నుంచి వైద్యులు, చైల్డ్ లైన్ ప్రతినిధులు వివరాలు సేకరించారు.

ఆసుపత్రి వర్గాల కథనం ప్రకారం 12 ఏళ్ల బాలుడి కారణంగా అమ్మాయి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే కలమసెరి పోలీసులు రంగంలోకి దిగారు. బాలనేరస్తుల చట్టాన్ని అనుసరించి 12 ఏళ్ల బాలుడుని (నిందితుడు) అదుపులోకి తీసుకున్నారు.

Kochi: Girl delivers in hospital, 12-year-old-boy booked

ఇంత సున్నితమైన కేసు గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, రహస్యంగా ఆపరేషన్ నిర్వహించినందుకు సదరు ఆసుపత్రి, వైద్యులు మీద పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు.

అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్ సంరక్షణా కేంద్రం అధికారులు మాత్రం పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. పాపకు జన్మనిశ్చిన అమ్మాయి రెండు నెలల కిందటే మేజర్ అయ్యిందని అన్నారు.

అందు వలన ప్రసవం గురించిన సమాచారం పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీస్తామని, సోమవారం కలమసెరి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ (సీఐ) జయకృష్ణన్ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+