అమ్మాయిలను తాకుతూ హోంగార్డు వెకిలి చేష్టలు: వీడియో వైరల్, వేటు పడింది
Recommended Video

కొచ్చి: వేధింపుల నుంచి రక్షణ కల్పించాల్సిన పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఓ పోలీసే మహిళలు, బాలికల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. కేరళలోని కొచ్చి తివారాలో చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న శివకుమార్ అనే ట్రాఫిక్ హోంగార్డు.. అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధింపులకు దిగాడు.
ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఎలమక్కరాకు చెందిన 58 ఏళ్ల శివకుమార్ యూనిఫాంలో ఉండి కూడా కావాలని మహిళలను, స్కూలు విద్యార్థులను అసభ్యంగా తాకారు. దీంతో తాత్కాలిక ఉద్యోగి అయిన అతన్ని ఫైర్ డిపార్డ్‌మెంట్‌కు బదిలీ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెలిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో సీటి పోలీస్ కమిషనర్ సదరు హోంగార్డుపై సీరియస్ అయ్యారు.
శివకుమార్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మరో వైపు శివకుమార్‌పై ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications