నెట్లో అసభ్య ఫోటోలు పెట్టిన బాయ్‌ఫ్రెండ్, గర్ల్ ఆత్మహత్య

 Kolkata girl kills self after lover posts indecent comments
కోల్‌కతా: సామాజిక వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో తన ఫోటోను మార్ఫింగ్ చేసి, అసభ్య ఫోటోను అప్ లోడ్ చేయడంతో అవమానభారం తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన పద్దెనిమిదేళ్ల యువతి ఇంటర్మీడియేట్ చదువుతోంది.

ఆ విద్యార్థిని తనకు ఆన్‌లైన్లో పరిచయం అయిన ఫైజల్ ఇమ్రాన్ ఖాన్ అనే స్నేహితుడు తన ఫోటోను మార్ఫింగ్ చేసి, అసభ్య ఫోటోను పేస్‌బుక్‌‍లో అప్ లోడ్ చేశాడు. అంతేకాదు అందులో ఆమె ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాడు. దీంతో ఆమె ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఇమ్రాన్‌తో పాటు అతడి స్నేహితులను అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని కోల్‌కతాలోని బెహాలాలో గల తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది.

ఆ బాలిక తన సూసైడ్ నోట్లో ఏం జరిగిందనేది వివరించింది. సామాజిక వెబ్ సైట్లలో నిందితుడు అభ్యంతరకర మాటలతో ఎలా వేధించింది ఆమె పేర్కొంది. అనంతరం అతను ఆమె అభ్యంతరకర ఫోటోలు పెట్టాడు. దీంతో అతనితో ఆమె ఫ్రెండ్‌షిప్‌ను కట్ చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+