కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం: మంటలార్పిన 30ఫైరింజిన్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సెంట్రల్ కోల్‌కతాలోగల బాగ్రి మార్కెట్‌లోని ఓ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ బ్రిగేడ్‌కు చెందిన 30 ఫైరింజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
చాలా రద్దీగా ఉండే భవనంలో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి కోల్‌కతా మేయర్ సోవన్ చటర్జీ మాట్లాడుతూ.. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు జరిగిందన్నారు.

ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టు పక్కల చాలా బిల్డింగ్‌లు ఉన్నందున ఎగసిపడుతున్న అగ్ని కీలలను అదుపు చేసేందుకు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటివరకూ ప్రాణ నష్టం జరిగిన సమాచారమేదీ లేదన్నారు.












Click it and Unblock the Notifications