కోల్‌కతాలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతకు ఇళ్లు, కార్యాలయాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. దాంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.0 గా నమోదైంది. మయన్మార్ కేంద్రంగా వచ్చిన భూకంప ధాటికి వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ లోనూ భూమి కంపించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ జియో సైన్సెస్ స్పష్టం చేసింది.
కోల్ కతాలో భూ ప్రకంపనలు వణికించాయి. ఫిబ్రవరి 3 సాయంత్రం మయన్మార్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా కోల్ కతా, పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో భూమి దద్దరిల్లింది. మయన్మార్ లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రెక్టార్ స్కేలుపై 6.0గా నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. భూకంపం ధాటికి ఇళ్లు, కార్యాలయాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. దాంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

అయితే ఫిబ్రవరి 2 ఉదయం 3.30 గంటలకు 4.6 తీవ్రతతో అండమాన్ నికోబార్ దీవులలో భూకంపం సంభవించిన తర్వాత.. మయన్మార్ లో కూడా భూకంపం రావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 3 న వచ్చిన ప్రకంపనలకు కోల్ కతా తో పాటుగా ఢాకాలో కూడా ఇళ్లు, కార్యాలయాలకు పెచ్చులు ఊడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మయన్మార్ లో గత 71 గంటల్లో భూకంపం సంభవించడం ఇది మూడోసారి అని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ స్పష్టం చేసింది. ఇక ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications