శుభవార్త:జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ , నో చార్జ్ కొటక్ మహీంద్రా బ్యాంక్

బ్యాంకుల్లో కనీస నగదు నిల్వ లేని ఖాతాల్లో ఛార్ఝీల బాదుడుకు సిద్దమౌతున్నాయి.అయితే కొటక్ మహీంద్రా బ్యాంకు ఖాతాదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది.

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కనీస నగదు నిల్వ లేని ఖాతాల్లో ఛార్ఝీల బాదుడుకు సిద్దమౌతున్నాయి.అయితే కొటక్ మహీంద్రా బ్యాంకు ఖాతాదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. జీరో బ్యాలెన్స్ ,సేవింగ్స్ ఖాతాతో పాటు అన్ని డిజిటల్ లావాదేవీలను కూడ ఉచితంగా అందించనుంది.

811 ప్లాన్ తో ఈ సరికొత్త పథకాన్ని బుదవారం నాడు ప్రకటించింది. 811 ఖాతా తెరవడానికి ఆపరేట్ చేయడానికి ఆధార్, పాన్ నెంబర్ ఉంటే చాలని తెలిపింది. డిజిటల్ లావాదేవాలను ప్రోత్సహించే దిశగా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు బ్యాంక్ వెల్లడించింది.

మొబైల్ పోన్ల ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు రాబోయే 18 నెలలలో 16 మిలియన్ వినియోగదారులను సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా ఆ బ్యాంకు ప్రకటించింది.

kotak bank launches 811 'zero balance, zero charge' account

ఎక్కడైనా ఎప్పుడైనా ఐదు నిమిషాల్లోనే మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా ఈ ఖాతాను తెరవవచ్చు. ఆధార్ ఆధారిత వన్ టైం పాస్ వర్డ్ ప్రమాణీకరణ ద్వారా ఖాతా ప్రారంభించవచ్చు.

ఆర్థిక లావాదేవీల నిర్వహణతో పాటు ఆన్ లైన్ షాపింగ్ విమానాలు , సినిమా టిక్కెట్లు, హెటల్ గదులు బుకింగ్ సేవలను పొందవచ్చు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్పేస్ సేవలను కూడ అనుమతిస్తోంది.

కస్టమర్లకు వర్చ్యువల్ డెబిట్ కార్డు ఉచితమంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేజ్ ఆధార్ లేదా నెట్ లో వర్చువల్ అడ్రస్ తో బ్యాంకు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలు నడపొచ్చు.

అంతేకాదు పొదుపు ఖాతా నిల్వలపై ఏడాదికి 6 శాతం వరకు వడ్డీని చెల్లించనున్నామన్నారు. కొటక్ బ్యాంక్ ఈ డీ వైష్ చైర్మెన్ ఉదయ్ కొటక్ ప్రకటించారు.

ఎస్ బి ఐ, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకులు ఏప్రిల్ 1 నుండి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై కూడ కనీస బ్యాలెన్స్ ఫీజును వసూలు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+