రజనీకాంత్ డైలాగ్ రిపీట్ చేస్తున్న డీకే శివకుమార్, నాకు దక్కంది సిద్దుకు కూడా ?
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రవసత్తరంగా మారిపోయాయి. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటూ జోరుగా ప్రచారం జరిగిన కొన్ని గంటల్లోనే కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పూర్తిగా రివర్స్ అయ్యారు. నేను సీఎం కాకపోతే సిద్దరామయ్య కూడా సీఎం కావడానికి వీలులేదని, మీరు మరెవరినైనా సీఎం చేసుకోండి అంటూ డీకే శివకుమార్ ఎదురు తిరగడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బిత్తరపోయింది.
నన్ను సీఎం చెయ్యకపోతే సిద్దరామయ్యను కూడా సీఎం చెయ్యకూడదు, ఏఐసీసీ అధ్యక్షుడు అయిన మల్లికార్జున ఖార్గేని సీఎం చేస్తే ఆయన చెప్పినట్లు వింటానని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాళ్ల దగ్గర పడిఉంటానని డీకే శివకుమార్ తేల్చి చెప్పడంతో సిద్దరామయ్య వర్గీయులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు హడలిపోయారు.

బెంగళూరు సిటీలోని సిద్దరామయ్య ఇంటి ముందు భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేస్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ గురి అంతవరకు చేసిన హంగామాకు చిన్న విరామం ఇచ్చారు .ఇదే సమయంలో బెంగళూరు సిటీలోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లకు బ్రేక్ పడింది.
తనతో పెట్టుకుంటే కనకపుర బండ రాజకీయాల రుచి చూపించాల్సి వస్తుందని డీకే శికుమార్ ఓ సీనియర్ నాయకుడి ముందు ఘాటుగానే చెప్పినట్లు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా ఇలా ఎవ్వరు ఎంత నచ్చ చెప్పినా డీకే శివకుమార్ మాత్రం పట్టువిడవడం లేదని తెలిసింది.

తనకు దక్కంది ఎవ్వరికి దక్కకూడుదు అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ చెప్పిన డైలాంగ్ గుర్తింది కదా. సేమ్ అలాగే తనకు దక్కని సీఎం పదవి సిద్దరామయ్యకు కూడా దక్కకూడదు. మూడో వ్యక్తికి ఇచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు తేల్చి చెప్పారని తెలిసింది.
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెందిన నాయకులు దాదాపుగా అందరూ డీకే శివకుమార్ ను బుజ్జగించడానికి ప్రయత్నించి విసిగిపోయారు. ఇక మిగిలింది సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే. స్వయంగా సోనియా గాంధీ రంగంలోకి దిగి డీకే శివకుమార్ కు నచ్చ చెబితే తప్పా ఆయన ఎవ్వరి మాట వినేరకంగా కనిపించడం లేదని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు అంటున్నారు.












Click it and Unblock the Notifications