సిద్ధరామయ్యపై స్టింగ్ ఆపరేషన్: కృపా ఆల్వాకు కేపీసీసీ షోకాజ్ నోటీసు!

కర్ణాటక రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని నిర్వహించినట్లు ఆరోపించబడుతున్న స్టింగ్ ఆపరేషన్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వివాదంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, మాజీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ కృపా ఆల్వా ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. దీనిపై పూర్తి వివరణ కోరుతూ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేయడానికి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) నిర్ణయించింది.

అసెంబ్లీని పేల్చేసిన ఏఐ వీడియో.. కట్ చేస్తే కటకటాల పాలైన యువకుడు!
అసెంబ్లీని పేల్చేసిన ఏఐ వీడియో.. కట్ చేస్తే కటకటాల పాలైన యువకుడు!

వైరల్ వీడియో.. కుమారస్వామి ఆరోపణలు
గత రెండు వారాల క్రితం మాజీ సీఎం సిద్ధరామయ్యకు చెందినదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య.. ఆ వీడియో ప్రసారాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ న్యాయస్థానం నుంచి స్టే ఆర్డర్ పొందడమే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ స్టింహ్ ఆపరేషన్ వెనుక కాంగ్రెస్ అంతర్గత రాజకీయ కుట్ర ఉందంటూ కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ అధిపతితో కలిసి కాంగ్రెస్ నాయకురాలు కృపా ఆల్వా ఈ ఆపరేషన్ నిర్వహించారంటూ దానికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఆధారాలను ఆయన బహిర్గతం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

KPCC Showcause Notice to Congress Leader Kripa Alva in Siddaramaiah Sting Operation Row Full Details Here

ఎవరైనా ఉపేక్షించేది లేదు: కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్
ఈ వివాదంపై కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ స్పందిస్తూ.. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొందరు చేసిన నీచమైన యత్నమని ఆయన మండిపడ్డారు. సొంత పార్టీ నాయకుడైన సిద్ధరామయ్యను అప్రతిష్ట పాలు చేసే కుట్రలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైనా భాగస్వాములై ఉంటే.. వారిపై ఉపేక్షించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కృపా ఆల్వాకు ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశామని.. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేది సీఐడీ, సీబీఐ విచారణలో త్వరలోనే తేలుతుందని పేర్కొన్నారు.

ఎవరీ కృపా ఆల్వా?
కృపా ఆల్వా దశాబ్ధానికి పైగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. 1992లో హత్యకు గురైన మంగళూరుకు చెందిన ప్రముఖ సామాజికవేత్త అమర్ ఆల్వా సతీమణే ఈ కృపా ఆల్వా. భర్త మరణానంతరం సామాజిక సేవా రంగంలోకి అడుగుపెట్టిన కృపా ఆల్వా.. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దక్షిణ కన్నడ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా, కేపీసీసీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ప్రచార కమిటీ సమన్వయకర్తగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆమె కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులై.. పోక్సో చట్టం అమలు, బాలల హక్కుల పరిరక్షణపై విశేషంగా కృషి చేశారు.

చైనా దుస్సాహసంపై భారత్ వార్నింగ్..! గీత దాటాలనుకుంటే ఇక..!
చైనా దుస్సాహసంపై భారత్ వార్నింగ్..! గీత దాటాలనుకుంటే ఇక..!

కాంగ్రెస్ అంతర్గత కుట్రేనంటూ కుమారస్వామి ఫైర్
ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కుమారస్వామి శుక్రవారం మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సిద్ధరామయ్య గౌరవాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ నాయకులే ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నడిపించారని ఆరోపించారు. 2011 నాటి విషయానికి సంబంధించి సదరు మహిళను ముందటేసి 2023లో స్టింగ్ ఆపరేషన్ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ఈ విషయం రెండేళ్లకు పైగా తెలిసినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు అత్యంత ఆప్తురాలైన నాయకురాలే ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నారనే వార్తలపై రాష్టప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని కుమారస్వామి డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+