బీజేపీ సోషల్ మీడియా చీఫ్ కు సినిమా చూపించిన కేపీసీసీ, ఎఫ్ఐఆర్ బోనస్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోస్ట్ చేసిన వీడియోపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేపీసీసీ కమ్యూనికేషన్ అండ్ సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్ కో-ఛైర్మన్ రమేష్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగా బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది.
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా ఓటర్ల, ప్రజల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు అమిత్ మాల్వియా కుట్ర పన్నారని రమేష్ బాబు తన ఫిర్యాదులో ఆరోపించారు. జూన్ 17న అమిత్ మాల్వియా చేసిన ఓ ట్వీట్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

రాహుల్ గాంధీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి, మోసపూరితంగా ఆయన ఆటలు ఆడుతున్నాడని, భారత్ లో జీవిస్తున్న రాహుల్ గాంధీ అదే భారతదేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారు భారతదేశ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ తప్పుడు ప్రచారం చేసిందని, అలాంటి వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రమేష్ బాబు బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి పరువు నష్టం కలిగించేలా, ద్వేషాన్ని రెచ్చగొట్టేలా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తప్పుడు ప్రచారం చేశారని, ఈ వీడియో క్లిప్పింగ్స్ తప్పుదోవ పట్టించేలా ఉందని, మత సామరస్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రమేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమిత్ మాల్వియాపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఐటీ బీటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా మీద, అమిత్ మాల్వియా మీద ఇప్పటికే బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.
అమిత్ మాల్వియా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ చండీగఢ్ అధ్యక్షుడు అరుణ్ సూద్‌లపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. రాహుల్ గాంధీని హానికరమైన వ్యక్తిగా పోల్చుతూ యానిమేటెడ్ వీడియో తయారు చేసి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.బీజేపీ నాయకులు మతతత్వ గొడవలు జరగడానికి వీరు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ కొన్ని రోజుల క్రితం కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే బీజేపీ నాయకుల మీద కేసు పెట్టారు. ఇప్పుడు కేపీసీసీ సోషల్ మీడియా నాయకుడు రమేష్ బాబు కూడా కేసు పెట్టడంతో బీజేపీ నాయకులకు సినిమా కనపడుతోంది.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
ఈ జిరాఫీల మధ్య ఉన్న పామును చూశారా ? -
సిగ్గు లేదా మీకు.. ఇంత కక్కుర్తా.. ఆమెకు బాగా కలిసొచ్చిన నెగిటివ్ పబ్లిసిటీ !! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..!












Click it and Unblock the Notifications