కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ప్రభాస్ నెంబరు అడిగారు!
పార్లమెంటులో గోహత్య నిషేధంపై మొట్టమొదట బిల్లు ప్రవేశపెట్టింది కృష్ణంరాజేనని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సంతాప సభకు హాజరై కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్ నేరుగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజుని తాను అన్నగారు అని పిలిచేవాడినని, ఆయన పెదకర్మ రోజు వద్దామనుకున్నానని, కానీ బిజీ షెడ్యూల్ ఉండటంతో ఈరోజే రావాల్సి వచ్చిందన్నారు. బాహుబలి సినిమా చూడమని కృష్ణంరాజు కోరేవారన్నారు.
తమ కుటుంబం, ఆయన కుటుంబం కలిసి ఆ సినిమా చూశామన్నారు. చాలా బాగుందన్నారు. కృష్ణంరాజు రాజకీయ నేత కావొచ్చు, రెబల్ స్టార్ కావొచ్చని, ఆయన స్వగ్రామంలో ప్రతి ఒక్కరు ఆయనకు సొంత వ్యక్తిలాంటివారన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్‌చేసి ప్రభాస్ నెంబర్ ఇవ్వమంటే ఇచ్చానని, ఫోన్ లో మాట్లాడారన్నారు.

కానీ మళ్లీ తనకు ఫోన్‌చేసి ఫోన్లో వారిని పరామర్శించినా తనకు ఎంతో వెలితిగా ఉందని, ఒకసారి ఇంటికెళ్లి అందరినీ పరామర్శించవద్దామని రాజ్ నాథ్ కోరారన్నారు. సంస్మరణ సభలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణంరాజు తన ట్రీట్ మెంట్ కోసం లండన్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు తమ పార్టీ చేసిందని, తనకు ఫోన్ చేసి ప్రధానమంత్రి కలవాలన్నారని, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్నారు. కల్మషం లేని వ్యక్తి కృష్ణంరాజు అని కొనియాడారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications