చట్టాలు రద్దు చేసే వరకూ పోరాటం - పార్లమెంట్ కు ట్రాక్టర్ ర్యాలీ : ఏడాది పూర్తవుతున్న రైతుల ఆందోళన..!!
దాదాపుగా ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్న రైతులు...మూడు రైతు చట్టాలు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ గురునానక్ జయంతి నాడు తాము తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను ఉప సంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. రైతులకు క్షమాపణ చెప్పారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆ చట్టాల ఉప సంహరణ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. రైతులు తమ నిరసనలను విరమించి నివాసాలకు వెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు.
అయితే, చట్టాలను పూర్తిగా రద్దు చేసే ఆందోళన కొసాగించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) తేల్చిచెప్పింది. చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26న దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఆందోళనలకు రైతులు భారీ సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేసింది. ఆ రోజున.. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో పరేడ్ నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శాంతియుత ట్రాక్టర్ ర్యాలీలను నిర్వహిస్తాం. ఎమ్ఎస్పీ కల్పించేలా బిల్లు తీసుకురావాలి డిమాండ్ చేసింది.

విద్యుత్ బిల్లులను రద్దు చేసేవరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఓ ప్రకటనలో ఎస్కేఎమ్ తెలిపింది.ఈ నెల 22న నిర్వహిస్తున్న 'కిసాన్ మహాపంచాయత్'తో పెద్దసంఖ్యలో రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. దాదాపు 670 మంది రైతులు బలిదానం చేసుకున్నారు. వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈ పోరాటానికి ఓ స్మారకాన్ని నిర్మించాలి. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని ప్రకటన పైన భిన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో రైతు సంఘాలు మాత్రం తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకూ వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నాయి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications