పబ్లిక్‌లో పాడు పని చేయబోయిన కండక్టర్.. చివరికి ఏమైందంటే ?
మహిళలపై లైంగిక వేధింపుల సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కార్యాలయాలు, విద్యాసంస్థలు వంటి అనేక ప్రాంతాల్లో మహిళలు అనేక రకాల వేధింపులను ఎదుర్కొంటున్నారు. మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో జరిగే వేధింపుల వల్ల అనేక మహిళలు రాత్రి సమయంలో ప్రయాణించడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు చెప్పబోయే ఘటనతో పగటి సమయంలో కూడా రక్షణ కరువైందని అనడం తప్పు కాదేమో అనిపిస్తుంది.
తాజాగా కర్ణాటక రాష్ట్రం మంగళూరులో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. మంగళూరు నగరానికి ముడిపు నుంచి వస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై బస్సు కండక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిద్రలో ఉన్న బాధిత మహిళను ప్రదీప్ కశప్ప నాయక్ అనే కండక్టర్ అసభ్యంగా తాకాడని ఆరోపణలు వచ్చాయి. ఈ దృశ్యాలను ఓ ప్రయాణికుడు మొబైల్ ఫోన్‌తో వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయసంహిత సెక్షన్ 74, సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసి ప్రదీప్‌ను కోర్టులో హాజరుపర్చారు. అనంతరం అతడిని 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కెఎస్‌ఆర్‌టీసీ కూడా స్పందిస్తూ.. ప్రదీప్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసి, విచారణ పూర్తయ్యే వరకు అతని సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణను వేగవంతం చేసి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. మరోవైపు ఇటీవల కాలంలో ఢిల్లీ, ముంబై, బెంగుళూరు వంటి మెట్రో నగరాల్లో కూడా మహిళలపై వేధింపుల కేసులు భారీగా పెరిగాయి. మహిళల భద్రత కోసం గవర్నమెంట్ అనేక చర్యలు తీసుకుంటుంది.
అంతే కాకుండా ఉబెర్, ఓలా వంటి క్యాబ్ సేవల్లో కూడా మహిళలపై దాడులు జరిపిన ఘటనలు ఉన్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం, ప్రతి గంటకు కనీసం నాలుగు మహిళలు లైంగిక వేధింపులు, దాడులకు గురవుతున్నట్లు సమాచారం. సామాన్య ప్రజలు, నెటిజన్లు సైతం ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
A KSRTC conductor was caught sexually harassing a sleeping woman passenger on a bus near Mangaluru. The incident, recorded by a passenger, went viral, leading to the conductor's immediate removal from duty.#KSRTC #Mangaluru #SexualHarassment #BreakingNews #PublicTransport pic.twitter.com/WHJuLT4UCX
— LetsTalkMedia (@LetsTalkMedia_) April 25, 2025
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications