ఆరు రోజుల వేటకు తెర.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం!

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్ ఉన్నట్లు భద్రతా దళాలు ధ్రువీకరించాయి. నవంబర్ 11న కుల్గాంలోని సీఆర్పీఎఫ్ భద్రతా పోస్టుపై జరిగిన దాడికి ఇతనే ప్రధాన సూత్రధారి. సోమవారం కుల్గాం జిల్లాలోని లారూ ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యల సందర్భంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

పాకిస్థాన్ 'డ్రోన్ వార్'.. లక్ష టర్కిష్ FPV డ్రోన్ లతో.. భారత్ అలర్ట్.. ఏం జరుగుతోంది..?
పాకిస్థాన్ 'డ్రోన్ వార్'.. లక్ష టర్కిష్ FPV డ్రోన్ లతో.. భారత్ అలర్ట్.. ఏం జరుగుతోంది..?

ఎవరీ లతీఫ్ భట్?
భద్రతా ఏజెన్సీల వివరాల ప్రకారం.. లతీఫ్ భట్ కుల్గాం జిల్లా ఖ్రేవాన్ చాడర్(నయీ బస్తీ) నివాసి. గతంలో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన లతీఫ్ భట్.. స్థానికంగా వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే 2025 నవంబర్‌లో అకస్మాత్తుగా ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. నవంబర్ 19, 2025న కుటుంబ సభ్యులు పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత లతీఫ్ భట్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

Kulgam Encounter Mastermind of CRPF Post Attack LeT Commander Latif Bhat Killed Full Details

దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్, కుల్గాం జిల్లాల్లో జరిగిన పలు టార్గెటెడ్ కిల్లింగ్స్‌లో లతీఫ్ భట్ కీలక నిందితుడిగా ఉన్నాడు. లష్కరే తోయిబాతో పాటు ది రెసిస్టెన్స్ ఫ్రంట్, కశ్మీర్ రివల్యూషనరీ ఆర్మీ వంటి ఉగ్రవాద సంస్థలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. గతంలో 2026 జులైలో షోపియాన్‌లో భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్ నుంచి లతీఫ్ భట్ తృటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో ఇతనితో పాటు ఉన్న జాకీర్ అహ్మద్ గని అనే ఉగ్రవాది ఆ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

ప్రపంచంలోని 500 మంది పవర్‌ఫుల్ ముస్లింల జాబితా.. టాప్‌లో ఆ నలుగురు నేతలు!
ప్రపంచంలోని 500 మంది పవర్‌ఫుల్ ముస్లింల జాబితా.. టాప్‌లో ఆ నలుగురు నేతలు!

6 రోజుల వేట.. 600 మందికి పైగా విచారణ
నవంబర్ 11న సీఆర్పీఎఫ్ పోస్టుపై దాడి జరిగినప్పటి నుంచి ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు గత 6 రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రభావిత గ్రామాలను పూర్తిగా దిగ్బంధించి.. ఇళ్లు, తోటలు, దట్టమైన పొదలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టడానికి, ఆయుధాల నిల్వలను గుర్తించడానికి డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్లను రంగంలోకి దించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా 600 మందికిపైగా అనుమానితులను విచారించిన భద్రతా బలగాలు, పక్కా సమాచారంతో లారూ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+