సూపర్ కాప్: ప్రాణాలకు తెగించి కాపాడాడు(వీడియో)

నాసిక్: రక్షకభటుడనే పదానికి సరైన నిర్వచనమిచ్చాడు ఈ పోలీసు. అతని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కాపాడాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన నాసిక్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. నాసిక్‌లో గత కొద్ది రోజులుగా అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు లక్షలాది భక్తుల రద్దీ ఉండటంతో వారందరికీ భద్రతా చర్యలు చేపట్టడంలో తలమునకలయ్యారు పోలీసులు.

కాగా, ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వంతెన మీది నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 20 అడుగుల ఎత్తైన వంతెన పైనుంచి నదిలో దూకి ఆ వ్యక్తిని కాపాడాడు.

 Kumbh Super-Cop: He Jumped 20 Feet Into the River to Save a Life

ఇదంతా అక్కకున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఫొటోలను ఓ పోలీసు ఉన్నతాధికారి తన ట్విట్టర్లో పెట్టారు. నదిలో దూకిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఆ సాహస పోలీసు అధికారి మనోజ్ భరత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా పనిచేస్తుందనడానికి నిదర్శనమే ఈ ఘటన అని పలువురు ఆ సాహస పోలీసుకు అభినందనలు తెలుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+