బీజేపీకి షాక్ ఇచ్చిన త్రిబుల్ షూటర్, కాంగ్రెస్ లోకి స్వంతత్ర పార్టీ అభ్యర్థి: అయోమయంలో కమలం !
బెంగళూరు: కర్ణాటకలోని కుందగోళ్ శాసన సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివానంద బెంతూరుకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్థానిక నాయకుడు శివానంద బెంతూరుతో మంత్రి డీకే. శివకుమార్ చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.
కుందగోళ్ శాసన సభ నియోజక వర్గంలో శివానంద్ బెంతూరుకు మంచి పట్టు ఉంది. శివానంద్ బెంతూరు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. మంత్రులు జమీర్ అహమ్మద్, వినయ్ కులకర్ణి శివానంద్ బెంతూరుతో చర్చలు జరిపారు. మంత్రులు చర్చలు జరిపిన అనంతరం శివానంద్ బెంతూర్ నామినేషన్ వితడ్రా చేసుకుని తాను రాజకీయాల నుంచి శాస్వతంగా దూరం అవుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్రిబుల్ షూటర్ ఎంట్రీ
శివానంద్ బెంతూరు ఇలాంటి ప్రకటన చెయ్యడంతో కాంగ్రెస్ కు చెందిన మంత్రి డీకే. శివకుమార్ రంగప్రవేశం చేశారు. శివానంద్ బెంతూరును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి బీజేపీకి దెబ్బకొట్టాలని త్రిబుల్ షూటర్ స్కెచ్ వేశారు. శివానంద్ బెంతూరుతో మంత్రి డీకే. శివకుమార్ మంతనాలు జరిపారు.

భారీ ఓటు బ్యాంకు
శివనాంద్ బెంతూరు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే భారీ సంఖ్యలో ఆయనకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే శివానంద్ బెంతూరు కాంగ్రెస్ లో చేరడంతో ఆ ఓట్లు ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థికి పడే అవకాశం ఉంది. శివనాంద్ బెంతూరుకు స్పష్టమైన హామీలు ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఆడియో వైరల్
మంత్రి డీకే. శివకుమార్, శివానంద్ బెంతూరుతో చర్చలు జరిపిన సమయంలో రికార్డు అయిన ఆడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవితో పాటు వచ్చే శాసన సభ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ నీకే ఇస్తామని మంత్రి డీకే. శివకుమార్ శివానంద్ బెంతూరుకు హామీ ఇచ్చారని సమాచారం.

పార్టీ టిక్కెట్ నీకే
మాజీ మంత్రి శివళ్ళి మరణంతో ఖాళీ అయిన కుందగోళ్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి కుసుమ శివళ్ళి పోటీ చేస్తున్నారు. తాత్కాలికంగా కుసుమ పోటీ చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో నీకే టిక్కెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో శివానంద్ బెంతూరు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బీజేపీ విఫలం
శివానంద్ బెంతూరు కాంగ్రెస్ లో చేరడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. నియోజక వర్గంలో మంచి పట్టు ఉన్న శివానంద్ బెంతూరును ఆకర్షించడంతో బీజేపీ నాయకులు విఫలం అయ్యారు. చింతగోళ్ లో మకాం వేసి మంత్రి డీకే. శివకుమార్ చకచక్యంగా వ్యవహరించి శివానంద్ బెంతూరును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని బీజేపికి షాక్ ఇచ్చారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications