సుష్మా స్పీచ్: ఆనందంతో అద్వానీ కంట నీరు

న్యూఢిల్లీ: లలిత్ మోడీకి సాయంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఇచ్చిన తీరుకు బీజేపీ అగ్రనేత ఎల్‌కే ముగ్దుడైపోయారట. లలిత్ మోడీకి సాయం చేయడంపై సుష్మా స్వరాజ్ ఈరోజు 30 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడారు. ఒకానొక దశలో అమె ప్రసంగం తీరుని చూసి అద్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

పార్లమెట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి కాంగ్రెస్ సహా, ఇతర విపక్షాలు చేసిన విమర్శలను సుష్మా తిప్పికొట్టిన తీరు బీజేపీ అగ్రనేతను ఆకట్టుకుంది. ఈరోజు ప్రతిపక్షాల నిరసనల మధ్యనే తన చక్కని వాగ్ధాటితో సభ్యులను కట్టడి చేసేందుకు సుష్మా అన్నివిధాలా ప్రయత్నించారు.

లోక్‌సభలో సుష్మా స్వరాజ్ ప్రసంగం చేసిన సమయంలో ఆమె పక్కనే అద్వానీ ఆశీనులయ్యారు. ఎంతో అనుభవం కలిగిన ఎల్‌కే అద్వానీ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నో వివాదాలకు, వేడివాడి చర్చలకు, చారిత్రక నిర్ణయాలకు సాక్ష్యంగా నిలిచారు. దీంతో ఈరోజు సుష్మా స్వరాజ్ లలిత్ గేట్‌పై ఇచ్చిన వివరణ తీరు చూసి చలించిపోయారు.

L K Advani appreciates Sushma Swaraj's spirited defence in Lok Sabha

తన ప్రసంగంతో తన పార్టీని, తనను సుష్మా స్వరాజ్ ఎంతో చక్కగా సమర్ధించుకున్నారు. తాను మానవతా దృక్పథంతోనే లలిత్ మోడీకి సాయం చేశానని, తాను దొంగచాటుగా చేయలేదని చెప్పారు. సభలో సుష్మా మాట్లాడుతూ తాను మొదటి నుంచి దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నానని, విపక్షాలు మాత్రం అడ్డుకుంటున్నాయని చెప్పారు.

తాను చేసింది అధికార దుర్వినియోగం కాదన్నారు. రాహుల్ గాంధీకి సెలవులు తీసుకోవడం అంటే ఇష్టమని ఎద్దేవా చేశారు. క్విడ్ ప్రోకోకు పాల్పడింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమని తాను కాదని ఘాటుగా స్పందించారు. క్విడ్ ప్రోకో కింద రాజీవ్ గాంధీ నాడు అండర్ సన్‌ను భారత్ నుంచి పంపించేశారన్నారు.

రాహుల్ గాంధీ! ఒక్కసారి సెలవులు తీసుకొని వెళ్లి మీ కుటుంబ చరిత్ర చదువుకో అని సూచించారు. లలిత్ మోడీకి రైట్ ఆఫ్ రెసిడెన్సీ ఎలా లభించిందని తమను అడగటం కాదని, ఆయనకు రైట్ ఆఫ్ రెసిడెన్సీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు. తాను 38 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పటి వరకు తన పైన ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+