వీడియో : లడఖ్ యువ ఎంపీ డ్యాన్స్.. స్థానికులతో కలిసి జోష్

లడఖ్ : బీజేపీ యువ ఎంపీ జమ్యాంగ్ సేరింగ్ నామ్‌గ్యల్ మరోసారి చిందేశారు. 73వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లడఖ్‌లో స్థానికులతో కలిసి కాలు కదిపారు. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో భాగంగా ఆయన వేసిన స్టెప్పులు అలరించాయి. సంప్రదాయ నృత్యం చేసి ఔరా అనిపించారు. ఎలాంటి భేషజాలు లేకుండా స్థానికులతో కలిసి డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను స్థానికులతో కలిసి జరుపుకున్నారు ఈ యువ ఎంపీ. సంప్రదాయ దుస్తులు ధరించి లయబద్దంగా డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. ఆయన స్టెప్పులు చూసి ఆనందంతో స్థానికులు ఈలలు, చప్పట్ల మోత మోగించారు. అంతేకాదు డ్రమ్స్ కూడా వాయించి తనలోని మ్యూజిక్ సెన్స్ చాటారు.

ladakh mp jamyang tsering namgyal dance in independence day celebrations

ఆర్టికల్ 370 రద్దు.. జమ్ముకశ్మీర్ విభజన బిల్లుతో లడఖ్ వాసులు ఇటీవల సంబరాలు జరుపుకున్నారు. లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో స్థానికులు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఆ క్రమంలో అక్కడి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జమ్యాంగ్ సేరింగ్ నామ్‌గ్యల్ లడఖ్ వెళ్లారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సరదాగా గడిపారు. అంతేకాదు వారితో కలిసి స్టెప్పులేశారు. ఎంపీ తమతో కలిసి డ్యాన్స్ చేయడంతో లడఖ్ వాసుల ఆనందం అంతా ఇంతా కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+