video call: రాత్రి నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడిన యువతి, సెకండ్ షో సినిమా, యూట్యూబ్ లో ?
రాత్రి గంటకు పైగా ఓ యువతి నగ్నంగా వీడియో కాల్ లో ఓ యువకుడిని రెచ్చగొట్టి మాట్లాడింది. మరుసటి రోజు ఆ యువకుడికి ఫోన్ చేసిన మరో వ్యక్తి నీ నగ్న వీడియో కాల్ యూట్యూబ్ లో ఉంది చూసుకో అని చెప్పాడు.
ముంబాయి/బెంగళూరు: అర్దరాత్రి ఓ యువకుడికి గుర్తు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ లిఫ్ట్ చేసిన యువకుడు షాక్ అయ్యాడు. ఓ యువతి నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడింది. కొంతసేటికి కాల్ కట్ అయ్యింది. కొంత సేపటి తరువాత మళ్లీ అదే యువతి నగ్నంగా వీడియో కాల్ చేసి మాట్లాడింది. మళ్లీ కాల్ కట్ చేసింది. ఈసారి మాత్రం గంటకు పైగా ఆ యువతి వీడియో కాల్ లో ఆ యువకుడిని రెచ్చగొట్టి మాట్లాడింది. మరుసటి రోజు మరో ఫోన్ నెంబర్ నుంచి నేరుగా యువకుడికి ఫోన్ చేసిన వ్యక్తి అసలు సినిమా మొదలుపెట్టాడు. నీ నగ్న వీడియో కాల్ యూట్యూబ్ లో ఉంది చూసుకో అని చెప్పడంతో ఆ యువకుడు హడలిపోయాడు.

ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడాలేదు
ముంబాయిలోని అంథేరిలో నివాసం ఉంటున్న 31 ఏళ్ల యువకుడు ముంబాయిలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ యువకుడు మంచి జీతం తీసుకుంటున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్న యుకుడు అతనిపాటికి అతను ఇల్లు, ఉద్యోగం అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. యువకుడికి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు. ఆఫీసులో పని చేసే కొందరు. చిన్ననాటి స్నేహితులు కొందరు మాత్రమే అతనికి టచ్ లో ఉన్నారు.

అర్దరాత్రి సెకండ్ షో మలయాళం సినిమా
ఫిబ్రవరి 22వ తేదీన అర్దరాత్రి ఆ యువకుడికి గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఎవరో అర్జెంట్ గా ఫోన్ చేసి ఉంటారని అనుకున్న యువకుడు ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేసి షాక్ అయ్యాడు. ఓ యువతి నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడింది. కొంతసేటికి వీడియో కాల్ కట్ అయ్యింది. కొంత సేపటి తరువాత మళ్లీ అదే యువతి నగ్నంగా మరోసారి వీడియో కాల్ చేసి మాట్లాడి అతనికి సెకండ్ షో సినిమా చూపించింది. మళ్లీ కాల్ కట్ చేసింది. ఈసారి మాత్రం గంటకు పైగా ఆ యువతి వీడియో కాల్ లో ఆ యువకుడితో మాట్లాడి అతన్ని ఎంత రెచ్చగొట్టాలో అంత రెచ్చగొట్టి మాట్లాడింది.

మరుసటి రోజు షాక్
ఎవరో యువతి తనకు ఎందుకు పదేపదే నగ్నంగా వీడియో కాల్ చేసింది అంటూ ఆ యువకుడు రాత్రి మొత్తం నిద్రపోకుండా ఆలోచించాడు. మరుసటి రోజు ఆ యువకుడు ఆఫీసుకు వెళ్లాడు. ఆరోజు మరో నంబర్ నుండి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడాడు. అతను చెప్పిన మ్యాటర్ తెలిసి ఆ యువకుడు షాక్ అయ్యాడు. రాత్రి మీ నగ్న వీడియో కాల్ చాలా రొమాంటిక్ గా ఉందని, మీరు మాట్లాడుకున్న తీరు అదిరింపోయింది అని చెప్పాడు. రాత్రి ఆ అమ్మాయితో నగ్న వీడియో కాల్ లో నువ్వు ఎందుకు మాట్లాడావు అని ప్రశ్నించాడు.

మూడు లక్షలు ఇచ్చినా వదల్లేదు
నువ్వు ఆ అమ్మాయితో నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది. ఆ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాము. ఆ వీడియో యూట్యూబ్ లో డిలీట్ చెయ్యాలంటే వెంటనే మా అకౌంట్ కు రూ. 31,500 రూపాయలు పంపించాలని బెదిరించారు. హడలిపోయిన యువకుడు వేరే ఆలోచనలేకుండా నిందితుడు అడిగిన డబ్బులు అతని అకౌంట్ కు పంపించాడు. తరువాత మళ్లీ ఫోన్ చేసిన నిందితుడు ఆ యువకుడిని బెదిరించి రూ. 62,500 రూపాయలు, మరుసటి రోజు రూ. 1.51 లక్షల రూపాయలు ఇలా ప్రతి రోజూ లక్షల్లో డబ్బులు వసూలు చేశారు.

ఫోన్లు చేసి టార్చర్ పెట్టారు
పరువు మర్యాదలకు భయపడిన యువకుడు నిందితులకు రూ. 3 లక్షలకు పైగా డబ్బులు సమర్పించుకున్నాడు. అందులో ఆ యువకుడు అతని స్నేహితుడి నుండి రూ. 1.5 లక్షలు అప్పుగా తీసుకుని నిందితులకు పంపించాడు. అయినా నిందితుల నుంచి నగ్న వీడియో కాల్ బెదిరింపులు ఆగలేదు. అయితే నిందితులు మాత్రం ఆ యువకుడిని వదలకుండా టార్చర్ పెడుతూనే ఉన్నారు.

తెగించిన యువకుడు
నిందితులు అడుగుతున్న డబ్బులు ఇవ్వడానికి ఆ యువకుడి దగ్గర డబ్బులు కూడా లేవు. ఏమైతే అదికాని అంటూ ఆ యువకుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుల మీద ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి టైమ్ కాని టైమ్ లో వీడియో కాల్స్ వస్తే, వాటిని రిసీవ్ చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయని పోలీసులు అంటున్నారు. యువకుడు కేసు పెట్టడంతో ముంబాయి సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications