మా నేతను "పప్పు" అంటావా.. ఎంత ధైర్యం నీకు.. ఎంపీతో మహిళ వాగ్వాదం

జైపూర్ : సోషల్ మీడియా వినియోగం పెరిగాక కొందరి నేతల పేర్లు మారిపోయాయి. జనబాహుళ్యంలో అవే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ఓ పేరుంది. అయితే ఆ పేరే ఇప్పుడు రాజస్థాన్ ఎన్నికల్లో భాగంగా రచ్చరచ్చయింది.

బీజేపీ ఎంపీ దేవాజీభాయ్ ఎన్నికల్లో భాగంగా ఓ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి "పప్పు" అని సంబోధించారు. మాటిమాటికీ పప్పు, పప్పు అంటుండటంతో అక్కడే ఉన్న ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలికి కోపం వచ్చింది. మా నేతను అలా సంబోధిస్తారా.. ఎంత ధైర్యం మీకు అంటూ సదరు ఎంపీని చెడుగుడు ఆడేశారు. ఆ పదం ఎలా వాడారంటూ నిలదీశారు.

 lady argued with mp that how dare you called my leader in the name of pappu

ఎంపీని మహిళా నేత నిలదీయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీని అందరూ అలా సంబోధిస్తారు కాబట్టే తాను అలా మాట్లాడానంటూ సమర్థించుకున్నారు సదరు ఎంపీ. దీంతో ఆమెకు మరింత కోపమొచ్చింది. అందరూ బావిలోకి దూకితే మీరు దూకుతారా అంటూ ఎదురుతిరగడంతో అవాక్కవడం ఆయన వంతైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+